Gossipsఅనసూయ భర్త కోసం అంత పెద్ద ప్లాన్ వేసిందా ..?

అనసూయ భర్త కోసం అంత పెద్ద ప్లాన్ వేసిందా ..?

యాంకర్లు అందరూ అసూయా పడేలా వాళ్ళ ఆఫర్లు కూడా కొట్టేస్తూ తన అందచందాలతో … అందరిని ఆకట్టుకుంటున్న టాప్ యాంకర్ అనసూయ. ఒక పక్క యాంకరింగ్ .. మరోపక్క సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ భామ పేరుకి పేరు ఇటు డబ్బుకి డబ్బు రెండు చేతులా సంపాదించేస్తోంది. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అవకాశాలు మాత్రం ఎటు పోకుండా కాపాడుకుంటూ వస్తోంది.

అంతా బాగానే ఉంది కాని తన ఫ్యామిలీ నుంచి తాను ఒక్కర్తే ఇండస్ట్రీలో ఉంటే ఎలా, తన భర్త కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుందేమో అందుకే తన భర్తని కుడా ఈ బుల్లి తెర మీద కానీ , వెండితెర మీద కానీ చుకోవాలని ముచ్చట పడింది. అనుకున్నదే ఆలస్యం వెంటనే రంగంలోకి దిగిపోయింది. భర్త సుశాంక్ భరద్వాజ్ ఫోటోలు తీసుకెళ్ళి తనకు బాగా సన్నిహితంగా ఉండే దర్శక నిర్మాతలతో మాట్లడి ఆఫర్ ఇప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఇప్పుడిప్పుడే వార్తలు బయటకి వస్తున్నాయి.
శశాంక్ మరీ యువకుడు ఏమి కాదు. ముప్పై పడి ఎప్పుడో దాటేసాడు కాబట్టి హీరో పాత్రలు చేయించలేరు కాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే ట్రై చేయొచ్చు. సినిమాల్లో వర్క్ అవుట్ కాకపోతే టీవీ రియాలిటీ షో ఎందులో అవకాశం దొరికితే అందులో తన వార్తకు అవకాశం వచ్చేలా చెయ్యాలని అనసూయ ప్లాన్.

అనసూయ భర్త సుశాంక్ బ్యాంకు ఉద్యోగి. మంచి పొజిషన్ లో ఉన్నాడు.ఇప్పుడు నటన వైపు రావాలి అంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో అయినాతప్పకుండా రాజీనామా చేయాల్సి ఉంటుంది.అయితే దీనికి అతను సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.అయితే అనసూయ మాత్రం తన ట్రైల్స్ మానలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news