వర్షిణి దెబ్బకు జబర్దస్త్ నుండి అనసూయ అవుట్..

46

ఈటివిలో జబర్దస్త్ షో అంటే ఎంత పెద్ద క్రేజ్ అన్నది అందరికి తెలిసిందే. బుల్లితెర మీద కామెడీ కితకితలు పెట్టే ఈ షోకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అప్పుడప్పుడు కాస్త అడల్ట్ కామెడీ అనిపించినా షో చూస్తున్నంతసేపు ఆడియెన్స్ ను నవ్వించడమే అన్నది కంటెస్టంట్స్ కాన్సెప్ట్. కేవలం కామెడీనే కాదు అనసూయ, రష్మిల గ్లామర్ కూడా ఈ షోకి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.

జబర్దస్త్ అనసూయ చేస్తే ఆమె ప్లేస్ లో కొన్నాళ్లు షో చేసిన రష్మితో ఎక్స్ ట్రా జబర్దస్త్ షో మొదలు పెట్టారు. గురు, శుక్రవారాల్లో రాత్రి నవ్వుల సందడి చేసే ఈ షోలు ఎప్పటికి ఎవర్గ్రీనే. ఇక జబర్దస్త్ షోలో అనసూయకు ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు ఆ షోతో అమ్మడికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అటు స్మాల్ స్క్రీన్, ఇటు సిల్వర్ స్క్రీన్ రెండిటిని బాలెన్స్ చేస్తుంది అనసూయ.

ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ ప్రోమోలో షోలో యాంకర్ గా అనసూయ బదులు వర్షిణి వచ్చి చేరింది. అనసూయ జబర్దస్త్ నుండి అవుట్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం ఆమె బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్ కు రాలేకపోయిందట. అయితే ఆమె వల్ల షో మిస్ అవకూడదు కనున వర్షిణిని పెట్టి రెండు వారాలు షో నడిపించేశారు అది మ్యాటర్. అదేంట్ రష్మి ఉందిగా ఆమెను పెట్టొచ్చుగా అంటే వర్షిణి అయితే కొత్తగా ఉంటుందని కాస్త చేంజ్ ఓవర్ కోసం ఇలా ట్రై చేశారట. ప్రోమోలో వర్షిణి లుక్ బాగుంది.. ఇక ఈ ఎపిసోడ్ స్కిట్స్ కూడా అదిరిపోయాయనిపిస్తుంది. మరి వర్షిణి యాంకర్ గా వస్తున్న జబర్దస్త్ ఏమేక్రౌ ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a comment