అనసూయలేని జబర్దస్త్ చూడగలమా..!

36

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అంటే బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు ఆ ఒక్క షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. షోలో కామెడీతో పాటుగా అనసూయ అందాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. జబర్దస్త్ షోకి ఒక్కసారి బ్రేక్ ఇచ్చిన అనసూయ రష్మికి ఛాన్స్ ఇచ్చింది. ఇక రష్మికి మంచి రెస్పాన్స్ రాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ అని పెట్టారు.

ఇక ఇప్పుడు అనసూయ సినిమాల్లో బిజీ అవుతుండటం వల్ల ఆమె జబర్దస్త్ కు పూర్తిగా గుడ్ బై చెప్పబోతుందని తెలుస్తుంది. జబర్దస్త్ వల్ల సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఎంత చేసినా బుల్లితెర యాంకర్ గా ఉండటమే తప్ప పెద్దగా ఒరిగి ఒళ్లో పడేది ఏమి ఉండదు. ఈమధ్య జబర్దస్త్ షోకి చిన్నపాటి గ్యాప్ ఇచ్చిన అనసూయ సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు పూర్తిగా జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చేస్తుందట అనసూయ.

క్షణం సినిమా నుండి సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతున్న అనసూయ కథనం అంటూ స్పెషల్ థ్రిల్లర్ మూవీతో వస్తుంది. ఇవే కాకుండా అనసూయ పూర్తిస్థాయిలో సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తుంది. అందుకే జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేస్తుందట. షోలో కమెడియన్స్ తో పాటుగా అనసూయ అందాలకు ఫ్యాన్స్ ఉన్నారు. మరి అనసూయ లేకుంటే ఆ లోటు కచ్చితంగా కనబడుతుందని చెప్పొచ్చు.

Leave a comment