Gossipsమెగా హీరో తో రొమాన్స్ చేస్తున్న అనసూయ..?

మెగా హీరో తో రొమాన్స్ చేస్తున్న అనసూయ..?

జబర్దస్త్ యాంకర్ అనసూయ టైం బాగా నడుస్తుందని చెప్పొచ్చు. బుల్లితెర మీద తన అందాలతో అలరిస్తున్న అమ్మడు వెండితెర మీద కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. రంగస్థలం సినిమాలో ఆమె నటనతో అందరిని మెప్పించగా ఇంకా మరిన్ని ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం అనసూయ కథనం సినిమాలో నటిస్తుండగా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ అందుకుందట అనసూయ.

సైరా నరసిం హా రెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో ఇప్పటికే సునీల్ ఛాన్స్ అందుకోగా ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా అవకాశం అందుకుందట. చూస్తుంటే కొరటాల శివ చ్రీంజీవి ప్రాజెక్ట్ ను కూడా క్రేజీగా మార్చేలా ఉన్నాడు. మిర్చి నుండి భరత్ అనే నేను వరుస హిట్లు అందుకున్న కొరటాల శివ ఈసారి మెగాస్టార్ తో కూడా అదిరిపోయే కథతో వస్తున్నాడట.

సైరా సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి అవుతుండగా కొరటాల శివ సినిమా త్వరలో మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ కూదా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news