Gossipsదుమ్మెత్తిపోస్తున్న బ్యూటీ.. చేసిందంతా వారే..!

దుమ్మెత్తిపోస్తున్న బ్యూటీ.. చేసిందంతా వారే..!

యాంకర్‌గా తన అందాల ఆరబోతతో సినిమా ఛాన్సులు దక్కించుకుని లీడ్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగిన హాట్ బ్యూటీ అనసూయ, తాజాగా నటించిన మూవీ కథనం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అయితే సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది అనసూయ. అయితే కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు2 సినిమాతో పోటీకి దిగిన కథనం ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగలింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో అనసూయ బాగా అప్సెట్ అయ్యింది. కానీ అమ్మడు ఈ సినిమా ఫెయిల్యూర్‌కు కారణం దర్శకుడని చెబుతోంది. తాను సినిమాకు బాగా పబ్లిసిటీ చేశానని.. కానీ దర్శకుడే సరిగా తీయలేదని ఆమె ఆరోపిస్తోంది.

ఏదేమైనా సినిమా హిట్టయితే అంతా తామే చేశామని.. సినిమా ఫెయిల్ అయితే మాత్రం ఇలా ఇంకొకరిపై నిందవేయడం ఏమాత్రం బాలేదని అనసూయను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. మరి సినిమా సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్‌ను కూడా ఒప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి నటీనటులపై ఉంటుందని వారు తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news