‘దయచేసి అలా చేయకండి ప్లీజ్’ అంటూ వేడుకుంటున్న యాంకర్ అనసూయ

anasuya bharadwaj request fans to not use bad words on her

Anasuya bharadwaj request fans to not use bad words on live. Watch video below.

యాంకర్ అనసూయ.. ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ అందరిలోనూ హుషారు నింపుతుంటుంది. తనదైన మాటల గారడితో అందరినీ మైమరిపిస్తుంటుంది. ఎలాంటి సమయంలోనైనా.. చిరునవ్వు నవ్వుతూ ఇతరులకూ సంతోషం పంచుతుంది. అలాంటి ఈ అమ్మడు.. తొలిసారి ఫేస్‌బుక్ లైవ్ చాట్‌లో చాలా దీనంగా కనిపించింది. అలాగే.. ఓ విషయంలో అభిమానులను వేడుకుంది కూడా. ఆ విషయం ఏంటనుకుంటున్నారా!

అనసూయకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. ద్వేషించే యాంటీ-ఫ్యాన్స్ కూడా అంతేమంది ఉన్నారు. వీళ్లందరూ ఆమెపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. తన ట్విటర్ లేదా ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఏదైనా ఫోటోలు పెడితే చాలు.. దానికి వల్గర్ కామెంట్స్ చేసేస్తారు. కేవలం వీళ్లే కాదు.. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్న కోపంతో కొందరు నెటిజన్లు కూడా తిట్లపురాణం సంధిస్తున్నారు. ఈ తరహా కామెంట్స్ ఈమధ్య నుంచి కాదులెండి.. ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ చేయొద్దని గతంలో చాలాసార్లు అనసూయ వేడుకుంది. కానీ.. ఎవ్వరిలోనూ మార్పు రావడం లేదు. చేసేవాళ్లు ఇంకా వల్గర్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో.. ఈ అమ్మడు మరోసారి లైవ్‌లోకి వచ్చింది.

తొలుత అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడిన అనసూయ.. తనపై వల్గర్ కామెంట్స్ చేయొద్దని వేడుకుంది. మాకూ ఫ్యామిలీస్ ఉన్నాయని, ఆ కామెంట్స్ చూసినప్పుడల్లా ఎంతో బాధ కలుగుతుందని, దయచేసి మరోసారి అలాంటి కామెంట్స్ చేయొద్దంటూ కోరుకుంది. గతంలోనూ ఇలా చాలాసార్లు చెప్పినా ఎవరూ మారడం లేదని, అటెన్షన్ కోసం అలాంటి కామెంట్స్ చేస్తారో లేదో తెలీదు కానీ.. ప్లీజ్ బ్యాడ్ వర్డ్స్ వాడకండంటూ తెలిపింది. అలాగే.. తన డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్ చేసినవారికి రిప్లై ఇస్తూ..‘నా లైఫ్ నా ఇష్టం.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే’నని చెప్పింది. ఇంకా.. అనసూయ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే..

తన మాటలపై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ బాక్సుల్లో వ్యక్తపరచండి..

Leave a comment