News భారతీయుల్ని కడిగిపారేసిన అనంత శ్రీరామ్..ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో

భారతీయుల్ని కడిగిపారేసిన అనంత శ్రీరామ్..ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో

కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు ఎలా వెల్లువెత్తుతున్నాయో.. విమర్శకులు కూడా అంతే నోరు పారేసుకుంటున్నారు. ఎలాంటి ముందు చర్యలు లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తెలివితక్కువతనమంటూ ప్రధాని మోడీని విమర్శిస్తున్నారు. ఎవరి దగ్గర బ్లాక్‌మనీ ఉందో వారి భరతం పట్టకుండా.. సామాన్య ప్రజల్ని సైతం రుద్దడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల్లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, లైన్‌లలో నిలబడలేక అనారోగ్య బారిన పడుతున్నారని, మోడీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని మండిపడుతున్నారు. ఇలా ఎంతోమంది ఎన్నో విధాలుగా మోదీని విమర్శిస్తూనే ఉన్నారు.

నిజానికి.. మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం మన దేశ భవిష్యత్తు కోసమే. ఈ దెబ్బతో నల్లధనం బయటపడడమే కాదు.. దేశాభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే కానీ.. ఓ మంచి పని చెయ్యాలంటే కొంతవరకు ఇబ్బంది పడక తప్పదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. దేశ ప్రజలు బాగుండాలనే కదా.. పాక్ ఉగ్రవాదులతో సైనికులు పోరాడుతున్నారు.. అలాంటిది బ్లాక్‌మనీ మీద పోరాడుతున్న మోదీకి మద్దతునిస్తూ కాస్త సహనం పాటించలేమా? ఓ షాపింగ్ మాల్ ఆఫర్ ప్రకటిస్తే.. అందులో ఎంతమంది బారులు తీరరు? అప్పుడు వేలాదిమంది లైన్లలో నిలబడరా? అప్పుడలేని నొప్పి.. ఇప్పుడెందుకు? ఎందుకంటే.. మన భారతీయులం.

అవును.. ఎలాంటి కష్టం లేకుండానే మనకు అన్నీ దక్కాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చెప్పుకుంటాం కానీ.. అలా వచ్చి మంచి చేస్తున్న మోదీని మాత్రం ఎద్దేవా చేస్తున్నాం. ఇదే విషయం మీద రచయిత అనంత శ్రీరామ్ చాలా అద్భుతంగా అభివర్ణించాడు. భారతీయుల నిజస్వరూపాన్ని తన మాటల్లో తెలిపాడు. మోదీ నిర్ణయంపై విరుచుకుపడుతున్న విమర్శకులను కడిగిపారేశాడు. ఆ వీడియో మీకోసం..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news