Gossipsబాలయ్య సీన్ పై ఆనంద్ మహేంద్రా ట్వీట్..!

బాలయ్య సీన్ పై ఆనంద్ మహేంద్రా ట్వీట్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జై సిం హా. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు మాస్ అభిమానులకు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ విన్నర్ గా పొంగల్ వార్ లో గెలిచిన బాలయ్య మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఈ సినిమాలో కేవలం బాలయ్యకు మాత్రం సూటయ్యే కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి.

అందులో భాగంగానే ఏ.సి.పి వార్నింగ్ ఇస్తూ.. పిల్లాడి పాల డబ్బా కోసం బొలెరో ని బాలయ్య సింగిల్ హ్యాండ్ తో లేపే సీన్. ఈ సినిమాలో ఇది హైలెట్ సీన్.. అయితే విమర్శలు ఎన్ని వస్తున్నా ఒంటి చేత్తో అవలీలగా బొలెరో ఎత్తే దమ్ము బాలయ్యకే ఉందని చూపించారు. అయితే ఈ సీన్ అటు చేరి ఇటు చేరి మహింద్రా ఓనర్ దగ్గరకు వెళ్లింది.

ఏకంగా ఆనంద్ మహేంద్రానే ఈ సీన్ పై స్పందించడం విశేషం.. ఇక నుండి తమ సర్వీష్ స్టేషన్స్ లో హైడ్రాలిక్ లిఫ్ట్ మిషన్స్ అవసరం లేదని సరదాగా ట్వీట్ చేశాడు ఆనంద్ మహేంద్రా.. మొత్తానికి బాలయ్య సీన్ ఆయనకు సరదా అనిపించిందన్నమాట. ఆయన ఈ సన్నివేశాన్ని రభస చేయకుండా స్పోర్టివ్ గా తీసుకోవడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news