” అమ్మమ్మగారిల్లు ” ట్రైలర్.. సకుటుంబ సపరివార సమేతంగా..!

ammamagarillu-trailer

నాగ శౌర్య హీరోగా సుందర్ సూర్య డైరక్షన్ లో వస్తున్న సినిమా అమ్మమ్మగారిల్లు. ఛలో తర్వాత నాగ శౌర్య చేసిన ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ నెల 25న అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సందర్భంగా వదిలిన సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అమ్మమ్మగారిల్లు టైటిల్ కు తగినట్టుగానే అమ్మమ్మ గొప్పతనం గురించి ఇందులో చూపించారు.

నాగ శౌర్యతో పాటుగా షామిలి ఇందులో హీరోయిన్ గా నటించింది. స్వాజిత్ మూవీస్ బ్యానర్లో రంజిత్ ఈ సినిమాను నిర్మించారు. కళ్యాణ రమణ ఈ సినిమాకు మ్యూజిక్ అనించడం జరిగింది. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అమ్మగారిల్లు అని టీజర్, ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ మరింత ఇంప్రెస్ చేసింది.

యువ హీరో అయ్యుండు ఇలాంటి ఎమోషనల్ సబ్జెక్ట్ తీసుకోవడం నాగ శౌర్య గట్స్ ను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఈమధ్య కాలంలో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. రావు రమేష్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment