Gossipsకట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఆ పెద్ద హీరో కి ఇంకా...

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఆ పెద్ద హీరో కి ఇంకా తెలియదట..!

బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి భారతీయ సినిమా చరిత్రలో ఓ గొప్ప సినిమాగా నిలచింది బాహుబలి. రాజమౌళి సృష్టించిన ఈ సినిమా దాదాపు 1800 కోట్ల కలక్షన్స్ తో ప్రభ్నజనం సృష్టించింది. ఈ సినిమా హంగామా మన దగ్గర కన్నా బాలీవుడ్ లో ఎక్కువే అని చెప్పొచ్చు. ఓ తెలుగు సినిమా ఈ రేంజ్ లో సత్తా చాటడం అక్కడ స్టార్స్ కు కాస్త షాక్ అనిపించింది.

ఇక బాహుబలి సినిమా గురించి అక్కడ స్టార్స్ అంతా తమ అభిప్రాయాన్ని వెళ్లడించారు. ముంబైలో ఉంటేనే వారి ముందు బాహుబలి ప్రస్తావన తెచ్చే మీడియా వారు మన దగ్గరకు ఆ హీరో వస్తే ఎలా వదులుతారు. ప్రస్తుతం ‘సీక్రెట్ సూపర్ స్టార్స్’ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమీర్ ఖాన్ ను బాహుబలి సినిమా గురించి ప్రశ్నలు అడిగారు మన వాళ్లు.

బాహుబలి సినిమా ఓ అద్భుతమని.. రాజమౌళి మంచి కథకుడని అన్నారు ఆమీర్ ఖాన్. అంతేకాదు ప్రభాస్ సినిమాలో బాగా చేశాడని అన్నారు. అయితే తాను బాహుబలి బిగినింగ్ మాత్రమే చూశానని కన్ క్లూజన్ చూడలేదని అన్నాడు. ఇప్పటికి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తనకు తెలియదని త్వరలో సినిమా చూసి తెలుసుకుంటానని అన్నారు. మంచి కథ వస్తే తప్పకుండా తెలుగులో నటించేందుకు సిద్ధమే అని అన్నారు ఆమీర్ ఖాన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news