అమలా న్యూడ్ సీన్స్ కు కత్తెర తప్పదా..!

amala paul goes bold for aame

ప్రేమఖైది సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన చిన్నది అమలా పాల్. తెలుగులో స్ట్రైట్ గా చేసింది రెండు సినిమాలే అది నాయక్, బెజవాడ ఈ రెండు సినిమాల్లో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే అమలా పాల్ తమిళ సినిమాలు తెలుగులో బాగానే డబ్ అయ్యాయి. కోలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న అమలా పాల్ డైరక్టర్ విజయ్ ను పెళ్లాడి అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత అతని నుండి విడిపోయి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది.

కన్నడ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న అమలా పాల్ ప్రస్తుతం రత్న కుమార్ డైరక్షన్ లో ఆడై సినిమా చేస్తుంది. ఈ సినిమాను తెలుగులో ఆమెగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ అమలా పాల్ న్యూడ్ సీన్స్ అందరికి షాక్ ఇచ్చాయి. ఒంటి మీద నూలు పోగు లేకుండా అమలా నటించడం పెద్ద సాహసమే అనుకున్నారు. అయితే ఈ సీన్స్ కు సెన్సార్ కత్తెర పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో ఉన్న సౌలభ్యం మన దగ్గర లేదు. అందుకే హీరోయిన్ న్యూడ్ సీన్స్ కచ్చితంగా సెన్సార్ కత్తెర పడుతుందని అంటున్నారు. వెబ్ సీరీస్ లకు ఎలాంటి అభ్యంతరం లేదు కాని ఇలా సినిమాలో మాత్రం ఎవరు అంత సాహసం చేయలేదు. ఎలాగైనా పోయిన తన క్రేజ్ తెచ్చుకునే క్రమంలో అమలా పాల్ గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసింది. అయితే ఆమె సినిమా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ తప్పకుండా అమలాకు మంచి పేరు తెచ్చేలా ఉందని అంటున్నారు.

Leave a comment