ఎన్టీఆర్ తో అలా అయినందుకే నాని ని తీసుకున్నాం..!

why-ntr-elimate-for-bigboss

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా చేస్తున్నాడు. జూన్ 10న రాబోతున్న ఈ షో గురించి మీడియా ఇంటరాక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఆర్ ను కాదని నానిని తీసుకోడానికి గల కారణాలు బిగ్ బాస్ నిర్వాహకులలో ఒకరైన అలోక్ జైన్ స్పందించరు.

ఎన్.టి.ఆర్ వల్ల బిగ్ బాస్ సీజన్ 1 సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు నాని సెకండ్ సీజన్ కూడా సక్సెస్ అయ్యేలా చేస్తాడని అన్నారు. ఎన్.టి.ఆర్ కు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సీజన్ కు నానిని తీసుకున్నామని వాస్తవం ఒప్పుకున్నారు. ఇక ఎన్.టి.ఆర్ కాకుంటే నానినే దీనికి పర్ఫెక్ట్ అని అన్నారు అలోక్ జైన్.

ఇక ఈసారి కంటెస్టంట్స్ గా కూడా సెలబ్రిటీస్ ఉండబోతున్నారని తెలుస్తుంది. 100 రోజులు.. 16 మంది కంటెస్టంట్స్ తో రాబోతున్న ఈ సీజన్ శనివారం, ఆదివారం 9 గంటల నుండి ప్రసారమవుతుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు 9:30 గంటల నుండి టెలికాస్ట్ అవుతుంది.

Leave a comment