Gossipsమళ్లీ బ్రమోత్సవం డైరెక్టర్ తో అల్లుఅరవింద్ ...

మళ్లీ బ్రమోత్సవం డైరెక్టర్ తో అల్లుఅరవింద్ …

కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో క్రేజీ మల్టీస్టారర్ తీసి సత్తా చాటాడు. అయితే ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో మహేష్ బ్రహ్మోత్సవం తీసి కెరియర్ లోనే భారీ డిజాస్టర్ తెచ్చుకున్నాడు. బ్రహ్మోత్సవం తర్వాత అతనికి ఛాన్స్ ఇచ్చే నిర్మాత లేకుండా పోయారు.

ఏడాది గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల తన తర్వాత సినిమాకు కథ సిద్ధం చేసుకున్నాడట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో వస్తుందట. ఫ్లాప్ డైరక్టర్స్ ను దూరం పెట్టే ఈ బ్యానర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథకు ఫిదా అయ్యారంటే కచ్చితంగా ఈసారి శ్రీకాంత్ మంచి కథనే రాసుకుని ఉంటాడని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో మెగా హీరోనే ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే జరిగితే శ్రీకాంత్ మళ్లీ తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు ఓ లక్కీ ఛాన్స్ దొరికినట్టే. మరి మనవాడు ఈసారైనా వచ్చిన అవకాశాన్ని వాడుకుంటాడో లేదో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news