మహానటి టీంకు అల్లు ఫ్యామిలీ సర్ ప్రైజ్ ట్రీట్..!

allu-arjun-mahanati

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి టీం ను అల్లు ఫ్యామిలీ అల్లు అరవింద్, అల్లు అర్జున్ కలిసి ఘనంగా సత్కరించారు. అంతేకాదు ఓ చిన్న పాటి నైట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. బయోపిక్ అనగానే భయపడేలా ఉన్న అపోహలన్ని పటాపంచలు చేస్తూ సావిత్రి బయోపిక్ ను యువత సైతం చూసేందుకు ఇష్టపడుతున్నారు. సావిత్రిగా కీర్తి సురేష్ నటన హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.

ఈ సినిమాను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ కు సెలబ్రిటీస్ నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకెళ్తుండగా ఈ విజయాన్ని పురస్కరించుకుని మహానటి టీం కు అల్లు ఫ్యామిలీ సత్కరించడం జరిగింది. ఓ పక్క అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్యకు మహానటి పోటీగా వచ్చినా అతని సినిమా కన్నా మహానటి మౌత్ టాక్ బాగున్నా మంచి సినిమా గొప్ప సినిమాకు తన తరపున సపోర్ట్ అందించాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ విషయంలో అల్లు అర్జున్ ని మనస్ఫూర్తిగా అభినందించొచ్చు. హాట్స్ ఆఫ్ టూ అల్లు అర్జున్

ఇక ఈ డిన్నర్ పార్టీలో దర్శకధీరుడు రాజమౌళి, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి కూడా పార్టిస్పేట్ చేయడం విశేషం. విజయ్ దేవరకొండతో పాటుగా మహానటి దర్శక నిర్మాతలు ఈ డిన్నర్ లో పాల్గొన్నారు.

Leave a comment