అల్లు అర్జున్ ట్వీట్ పై నెటిజెన్లు ఫైర్..!

allu-arjun-tweet

స్టైలిష్ స్టార్ గా సినిమా సినిమాకు సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్న అల్లు అర్జున్ అలియాస్ బన్ని క్రేజ్ ఎంత ఉన్నా ఏ విషయానికి స్పందించాలి ఏ విషయాన్ని స్కిప్ చేయాలన్న చిన్న లాజిక్ తెలియకుండా అనవసరంగా నెటిజెన్ల కోపానికి బలవుతున్నాడు. అనవసరమైన విషయాల పట్ల బన్ని ఇచ్చే రెస్పాన్స్ అతన్ని ఇబ్బందుల్లో పడేసేలా చేస్తున్నాయి.

ఇంతకీ ప్రస్తుతం ఏమైంది అంటే.. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సిటీస్ ను సర్వే చేసిన టిక్ టాక్ బ్లూంబర్గ్ సంస్థ టాప్ 10 సిటీస్ ను ప్రకటించింది. అందులో మొదటి స్థానంలో సింగపూర్ ఉండగా 2,2 అంటూ జురిచ్ (స్విట్జర్లాండ్), పారిస్ (ఫ్రాన్స్) అని పెట్టారు. అయితే అల్లు అర్జున్ దీనిపై స్పందించి టైపో మిస్టేక్ అని.. జురిచ్ కు 3వ స్థానం ఇవ్వాలని సూచించాడు. అదే విధంగా మళ్లీ 6వ స్థానంలో మళ్లీ మరో రెండు సిటీస్ ఉంచారు.

అయితే వారి ఉద్దేశం ఏంటంటే ఎక్స్ పెన్సివ్ లో 2వ స్థానం, 3వ స్థానం కొద్దిపాటి తేడాలుండటంతో రెండు సిటీస్ కు 2వ స్థానం ఇచ్చి 3 మిస్ చేశారు. అలానే 6వ స్థానం రెండు సిటీస్ కు ఇచ్చి 7 మిస్ చేశారు. ఇదేదో టైపో మిస్టేక్ వల్ల జరిగింది కాదు. కావాలని చేసిందే అయితే ఈ విషయం పై స్పందించిన అల్లు అర్జున్ ఈ మాత్రం కూడా ఆలోచించ లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తనకు అనవసరమైన విషయం పట్ల బన్ని ఇచ్చిన ట్వీట్స్ రివర్స్ పంచ్ పడేలా చేస్తున్నాయి. qw

Leave a comment