చేసిన ఆ తప్పే ..మళ్ళీ చేయనంటున్న బన్నీ

allu-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే పక్కా హిట్ అన్న టాక్ ఉండేది. ఎలాంటి సినిమా అయినా సరే అవలీలగా 50 కోట్ల మార్క్ దాటుకునేలా చేసే బన్ని నా పేరు సూర్య రిజల్ట్ పై సాటిసఫైడ్ గా లేడు అన్నది వాస్తవం. బన్ని ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా నా పేరు సూర్య. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన సూర్య సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత బన్ని ఇక మీదట ఇలాంటి సీరియస్ రోల్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో బన్ని ఫుల్ లెంగ్త్ యాంగ్రీ సోల్జర్ రోల్ చేశాడు. సినిమాకు అదే పెద్ద మైనస్ అని తెలుసుకున్నాడు. అందుకే ఇక నుండి రూటు మార్చేయాలని ఫిక్స్ అయ్యాడట.

తన తర్వాత సినిమాపై ఎలాంటి క్లరిటీ ఇవ్వని బన్ని కుదిరితే ఈసారి ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రై చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అలాంటి కథల వేటలోనే పడ్డాడట మన స్టైలిష్ స్టార్. బన్ని ఫన్ ఎలిమెంట్స్ తో వచ్చిన జులాయి, రేసు గుర్రం సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అలానే ఇక మీదట కూడా అలాంటి సినిమాలే చేయాలని చూస్తున్నాడట. మరి బన్ని తీసుకున్న ఈ నిర్ణయం అతని కెరియర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడేలా చేస్తుందో చూడాలి.

Leave a comment