Gossipsఅజ్ఞాతవాసి దొంగ దెబ్బకు అల్లు అర్జున్ విల విల

అజ్ఞాతవాసి దొంగ దెబ్బకు అల్లు అర్జున్ విల విల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్ గా బన్ని సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇక టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా ఇప్పుడు ఆ సినిమా టీజరే కొత్త టెన్షన్ తెచ్చి పెట్టింది. సినిమా టీజర్ లో యాంగ్రీ సోల్జర్ గా కనిపించిన బన్ని ఓ హాలీవుడ్ సినిమా కాపీగా ఈ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

2002లో వచ్చిన యాంట్ వోన్ ఫిషర్ సినిమాలో కూడా యాంగ్రీ నేవీ ఆఫీసర్ తన సహ ఉద్యోగులను కూడా కొడుతుంటాడు. పై అధికారి సలహా మేరకు సైకాలజిస్ట్ ను కలుస్తాడు. అయితే చూస్తుంటే బన్ని సినిమాలో కూడా ఈ సీన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మెయిన్ కథ కాపీ అని చెప్పలేం కాని అల్లు అర్జున్ మాత్రం నా పేరు సూర్య కాపీ వివాదంపై తలపట్టుకున్నాడు.

అసలే అజ్ఞాతవాసి సినిమా లార్గో వించ్ డిటో దించేసి ఇది తన క్రియేటివిటీ అని చెప్పుకున్న త్రివిక్రం ఎంత నవ్వుల పాలయ్యాడు అన్నది ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందుకే మెగా ఫ్యాన్స్ మరోసారి తమ హీరోకి ఆ అపవాదం వద్దని భావిస్తున్నారు. వక్కతం వంశీ మాత్రం సినిమా కథ ఎక్కడ కాపీ కొట్టలేదని క్లియర్ గా చెప్పాడు. మరి యాంట్ వోన్ ఫిషర్ కథతోనే నా పేరు సూర్య వస్తుందా లేదా అన్నది తేలాలంటే ఏప్రిల్ 27 దాకా ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news