Gossipsఎన్టీఆర్ డైరెక్టర్‌ని తన్నుకుపోయిన అల్లు అర్జున్!!

ఎన్టీఆర్ డైరెక్టర్‌ని తన్నుకుపోయిన అల్లు అర్జున్!!

Finally stylish star Allu Arjun has given green signal to Vakkantham Vamshi to do a film in his debut directorial venture. Actually, Vamshi has to debut with NTR film, but in the last minute he rejected him for not preparing script well. Anyhow, after a long time Vamshi’s dream is going to fullfilled by Bunny.

దర్శకుడిగా మారాలని చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్న ఓ ప్రముఖ రచయిత.. తన తొలిప్రయత్నం ఎన్టీఆర్‌తోనే స్టార్ట్ చేయాలని బలంగా ఫిక్సయ్యాడు. అతని డేట్స్ కోసం మూడేళ్ళు వెయిట్ చేశాడు. అంతేకాదు.. తాను తీయాలనుకున్న ఓ సినిమాని తారక్ సక్సెస్ కోసం త్యాగం చేశాడు కూడా. అందుకు దాసోహమైన తారక్.. అతనికి డైరెక్టర్‌గా అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. చివరికి.. వీరి కాంబో సెట్ అవుతుందనుకున్న తరుణంలో.. కార్యరూపం దాల్చకముందే అటకెక్కింది. ఇప్పుడా రైటర్‌ని స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ తన్నుకుపోయాడు. ఇప్పటికే ఆ రచయిత ఎవరో మీకు ఓ అవగాహన వచ్చేసి ఉంటుంది. అవును.. మీరు అనుకుంటోంది నిజమే. ఆ రైటర్ మరెవ్వరో కాదు.. వక్కంతం వంశీ.

తారక్‌కి అత్యంత సన్నిహితుడైన వంశీ.. అతనితో మూవీ చేయాలని ఎంతో ఆశించాడు. మూడేళ్లు వెయిట్ చేయడంతోపాటు ‘టెంపర్’ కథని త్యాగం చేశాడు. అప్పుడు తారక్ అతనికి దర్శకుడిగా ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. ‘గ్యారేజ్’ తర్వాత చేద్దామనుకున్నాడు కానీ.. కథ నచ్చకపోవడంతో అతడ్ని పక్కన పెట్టేశాడు. ఎన్టీఆర్‌తో సినిమా సెట్ కాకపోవడంతో.. అల్లుఅర్జున్ దగ్గరకు వెళ్ళాడు వంశీ. అతడు చెప్పిన కథ విన్నాక.. తన నిర్ణయాన్ని మళ్ళీ చెబుతానని బన్నీ చెప్పాడు. అప్పటినుంచి నాన్చినాన్చి.. చివరికి అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. వంశీ చెప్పిన కథ నచ్చడంతో బన్నీ పచ్చజెండా ఊపేశాడట. దీంతో.. ఈ సినిమా పనులు ప్రారంభించేందుకు నిర్మాత రెడీ అయ్యాడు. మొత్తానికి.. చాలాకాలం తర్వాత వంశీకి దర్శకుడు అవ్వాలన్న కల బన్నీ ద్వారా నెరవేరబోతోందని చెప్పుకుంటున్నారు.

కాగా.. బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ చేస్తూనే మరో ప్రాజెక్ట్‌ని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్‌లోపు పూర్తి కానున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత వంశీ సినిమా ప్రారంభం కానుంది. అంతలోపు స్ర్కిప్ట్ డెవలప్‌మెంట్, ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో వంశీ బిజీ కానున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news