Newsప్రియా ప్రకాష్ కు బాగా కోపరేట్ చేస్తున్న అల్లు అర్జున్

ప్రియా ప్రకాష్ కు బాగా కోపరేట్ చేస్తున్న అల్లు అర్జున్

ఒకే ఒక్క టీజర్ తో దేశమంతా సంచలనం సృష్టించిన మళయాళ భామ ప్రియా ప్రకాశ్ వరియర్ నటించిన ఒరు ఆదార్ లవ్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు టైటిల్ గా లవర్స్ డే అని పెట్టారు. కన్నుగీటుతో కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెట్టి ఓవర్నైట్ స్టార్ డం తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ తొలి సినిమా అది కూడా టీజర్ తోనే సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. అమ్మడు కను సైగలకు స్టైలిష్ స్టార్ కూడా ఫిదా అయ్యాడు. అప్పటి నుండి ప్రియా ఇంకాస్త తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇక ఇప్పుడు ప్రియా నటించిన ఒరు ఆదార్ లవ్ తెలుగు వర్షన్ కు బన్ని హెల్ప్ తీసుకుంటున్నారు. ఎలాగు మళయాళంలో స్టైలిష్ స్టార్ కు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అందుకే ఈ చిన్న సినిమాకు తెలుగులో మంచి మార్కెట్ జరిగేలా బన్ని సపోర్ట్ ఇస్తున్నాడట. దానిలో భాగంగా సినిమా ఆడియో రిలీజ్ కు బన్ని గెస్ట్ గా వస్తాడని తెలుస్తుంది. ఈ నెల 23న జె.ఆర్.సి కన్వెన్షన్ లో లవర్స్ డే ఆడియో రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఆ వేడుకకు గెస్ట్ గా బన్ని వస్తున్నాడట. ప్రియ ప్రకాశ్ తో పాటుగా చిత్రయూనిట్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. డబ్బింగ్ సినిమాలకు తెలుగులో ఎప్పుడు మంచి గిరాకి ఉంటుంది. లవర్స్ డే సినిమా కూడా ప్రేక్షకులు మనసులు గెలిస్తే తప్పకుండా ఇక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకునే ఛాన్స్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news