Gossipsఅల్లు అర్జున్ ప్రవర్తనతో అసహనంలో త్రివిక్రం..!

అల్లు అర్జున్ ప్రవర్తనతో అసహనంలో త్రివిక్రం..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య ఫెయిల్యూర్ నుండి ఇంకా బయటపడలేదా.. స్టార్స్ అంతా హిట్లు కొడుతుంటే తను వెనుకపడ్డాడని అనుకున్నాడో ఏమో ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రం సినిమాకు సరిగా సహకరించడం లేదట బన్ని. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో త్రివిక్రం, బన్ని సినిమా తెరకెక్కుతుంది. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

బన్ని సొంత బ్యానర్ కూడా ఇన్వాల్వ్ అవడంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడట. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అసలైతే సోమవారం నుండి సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉందట. కాని బన్ని ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేశాడు. షెడ్యూల్ కన్నా ముందే రావాల్సి ఉన్నా మధ్యలో ప్లాన్ చేంజ్ చేశాడట. సోమవారం కాకున్నా మంగళవారం అయినా షూటింగ్ కు బన్ని వస్తాడని త్రివిక్రం భావించాడట.

బన్ని రాకపోవడంతో దర్శక నిర్మాతలు షూటింగ్ క్యాన్సిల్ చేశారట. అల్లు అర్జున్ ప్రవర్తనతో త్రివిక్రం చాలా అప్సెట్ అయ్యాడని తెలుస్తుంది. నిర్మాణంలో భాగమయ్యాడు కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడని అంటున్నారు. మరి ఓ స్టార్ హీరో అయ్యుండి మిగతా ఆర్టిస్టుల డేట్స్ గురించి తెలిసి ఇలా షూటింగ్ కు ఎగ్గొట్టడం ఎంత వరకు కరెక్ట్ అన్నది ఆయనకే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news