Moviesబావ బావ‌మ‌రుదులుగా.. అక్కినేని హీరో.. మెగా హీరో..!

బావ బావ‌మ‌రుదులుగా.. అక్కినేని హీరో.. మెగా హీరో..!

నాగార్జున మేన‌ల్లుడు అక్కినేని సుశాంత్ సోలో హిట్ కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా స‌క్సెస్ ఆయ‌న ద‌రిచేర‌లేదు. తాజాగా ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్‌కు రెడీ అయ్యారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమా `ఏఏ19`లో కీల‌క పాత్రలో సుశాంత్ న‌టిస్తున్నార‌ట‌. అయితే ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ్య‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో అల్లు అర్జున్‌- సుశాంత్ బావ బావ‌మ‌రుదులు క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. అల్లు అర్జున్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగ‌తి తెలిసింది. ఇక‌ మ‌రో హీరోయిన్ నివేద థామస్ అల్లు అర్జున్‌కు చెల్లెలుగా న‌టిస్తోంది. అయితే హీరో సుశాంత్ అటు పూజా హెగ్డేకు అన్న‌గా ఇటు నివేద థామ‌స్‌కు ల‌వ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కుండమార్పిడి పద్దతిలో వీరి పెళ్లిళ్లు ఒకే వేదికపై జరుగుతాయట.

త్రివిక్ర‌మ్‌- అల్లు అర్జున్ కాంబోలో ఇంత‌కు ముందు జులాయి, స‌న్ ఆప్ స‌త్య‌మూర్తి వీరిద్ద‌రి హిట్ ఇచ్చాయి. మ‌రో సారి వీరి కాంబినేష‌న్లో రాబోతున్న ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సుశాంత్ కీ రోల్ ఎలా ఉండ‌బోతుందో వ‌చ్చే ఏడాది సంక్రాంతి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news