GossipsRRRలో కేవలం కేమియో రోల్.. షాక్‌లో చరణ్ ఫ్యాన్స్!

RRRలో కేవలం కేమియో రోల్.. షాక్‌లో చరణ్ ఫ్యాన్స్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పెద్ద ప్రాజెక్టుల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్ ఆర్ఆర్ఆర్ సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఈ సినిమాపై కేవలం సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఫ్యాన్స్‌ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో తారక్, చరణ్‌ల పాత్రలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరు హీరోలకు జోడీలుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌తో పాటు ఓ హాలీవుడ్ బ్యూటీ కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ బ్యూటీ కేవలం కేమియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా..? బాలీవుడ్ బ్యూటీ ఆలియ భట్. ఈ సినిమాలో రాం చరణ్ సరసన హీరోయిన్‌గా ఆలియా భట్ నటిస్తోండగా.. ఆమె పాత్ర ఎలా ఉంటుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చరణ్ చేస్తున్న ఈ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. అయితే ఆయన సరసన నటిస్తున్న ఆలియా భట్ పాత్ర కేమియో పాత్రకు కాస్త పొడవుగా ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి ఆలియా భట్ పాత్రను కేవలం కేమియో కిందకు రాసుకున్న రాజమౌళి ఆమెను ఆ పాత్రలో ఎలా చూపించనున్నాడో చూడాలి. ఇక తారక్ సరసన నటిస్తున్న హాలీవుడ్ బ్యూటీ పాత్ర కూడా సినిమాలో అదిరిపోయే రేంజులో ఉండనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news