Moviesనాగార్జున ఆఫీసర్ ఎన్ని సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది..!

నాగార్జున ఆఫీసర్ ఎన్ని సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది..!

కింగ్ నాగార్జున, రాం గోపాల్ వర్మ కలిసి పాతికేళ్ల తర్వాత చేసిన సినిమా ఆఫీసర్. జూన్ 1న అనగా రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు నిన్నటిదాకా థియేటర్ల సమస్య ఉందట. రాం గోపాల్ వర్మ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారట. ఎవరి ఏరియాల్లో వాళ్ళు సినిమా పంపిణీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఈ సినిమా కొనేశారట.

మొత్తగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆఫీసర్ సినిమాకు 400 థియేటర్స్ దొరికాయని తెలుస్తుంది. ఆఫీసర్ తో పాటుగా రిలీజ్ అవుతున్న అభిమన్యుడు, రాజుగాడు సినిమాలు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ కే అమ్మేశారు కాబట్టి వాటికి మంచి థియేటర్సే వచ్చాయి. హీరో నాగార్జున కాబట్టి ఎలాంటి థియేటర్ లో సినిమా వచ్చినా బాగుంది అంటే చాలు సినిమా ఆడేస్తుంది.

శివ, గోవింద గోవింద తర్వాత నాగ్, వర్మ ఇన్నాళ్లకు కలిసి పనిచేసినా సినిమాపై మాత్రం బజ్ ఏర్పడలేదన్నది వాస్తవం. నాగార్జున ఏదో ఒక రెండు రోజులు ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రమోట్ చేసినట్టు అనిపించినా అన్నపూర్ణ టీం మాత్రం ఈ సినిమా విషయంలో అసలు జోక్యం చేసుకోలేదట. వర్మ దర్శక నిర్మాణంలో వస్తున్న ఈ ఆఫీసర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news