Gossipsఅఖిల్ సినిమాలో ఆ స్టార్ హీరో.. ఈసారైనా హిట్ దక్కేనా..!

అఖిల్ సినిమాలో ఆ స్టార్ హీరో.. ఈసారైనా హిట్ దక్కేనా..!

తన ప్రతి సినిమా విషయంలో కన్ ఫ్యూజన్ తో మొదలవుతున్న అఖిల్ సినిమాలు రిలీజ్ తర్వాత సందడి చేయడం లేదు. మొదటి సినిమా అఖిల్, రెండవ సినిమా హలో ఈ రెండు భారీ అంచనాలతో వచ్చి నిరాశ పరచాయి. అయితే సినిమాకు ముందే హైప్ క్రియేట్ చేసి దాన్ని అందుకోకపోతే కష్టమని ఈసారి సింపుల్ గా అఖిల్ 3వ సినిమా లాంచింగ్ జరిగింది.

ఈమధ్యనే తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఫైనల్ గా అఖిల్ తో సినిమా ఓకే చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దర్శనమిచ్చాడు. సినిమా ముహుర్తంలో పాల్గొన్నాడు అంటే సినిమాలో ఉండే ఉంటాడని వార్తలు రాయడం మొదలు పెట్టారు. అఖిల్ 3వ సినిమా మల్టీస్టారర్ గా రాబోతుందా.. దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్న అఖిల్ ముందు నుండి సినిమా మీద అంచనాలను పెంచకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఓపెనింగ్ కూడా నాగార్జున మాత్రమే వచ్చాడు. మరి తొలిప్రేమ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ అఖిల్ కు కమర్షియల్ సక్సెస్ అందిస్తాడా లేడా అన్నది చూడాలి. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news