Gossipsఅఖిల్ అక్కినేని " Mr.మజ్ను" రివ్యూ & రేటింగ్

అఖిల్ అక్కినేని ” Mr.మజ్ను” రివ్యూ & రేటింగ్

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన మొదటి రెండు సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. తొలిప్రేమ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఈ సినిమా రావడంతో దీనిపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన Mr.మజ్ను ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
విక్కీ(అఖిల్ అక్కినేని) ఒక రొమాంటిక్ ప్లేబాయ్‌గా పరిచయమవుతాడు. తనకు నచ్చే అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ చేసి వారిని ఎలాగైనా పడేయాలని చూస్తుంటాడు. నిక్కీ(నిధి అగర్వాల్) తనకు కాబోయేవాడు చాలా సిన్సియర్‌గా కేవలం తనను మాత్రమే ప్రేమించే వాడు కావాలని కోరుకుంటుంది. కట్ చేస్తే.. వీరిద్దరి మధ్య ఏర్పడిన ఫ్రెండ్‌షిప్ కారణంగా నిక్కీ విక్కీని ఇష్టపడుతోంది. అయితే తనను జీవితాంతం ప్రేమించాలనే కండీషన్‌ను విక్కీ తిరస్కరిస్తాడు. దీంతో వారిద్దరి మధ్య బ్రేకప్‌ అవుతుంది. కట్ చేస్తే.. నిక్కీ సిన్సియర్ లవ్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని విక్కీ ప్రయత్నిస్తాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు విక్కీ ఏం చేశాడు? నిక్కీ ఎక్కడికి వెళ్లిపోయింది? నిక్కీ ప్రేమను విక్కీ దక్కించుకుంటాడా? అనేది మిగతా స్టోరీ.
1
విశ్లేషణ:
అఖిల్ అక్కినేని ఎంతగానో వెయిట్ చేసి సక్సెస్ కొట్టాలనే కసితో Mr.మజ్ను సినిమాను చేశాడు. దర్శకుడు వెంకీ అట్లూరిపై పూర్త నమ్మకంతో ఈ సినిమాను చేశాడు అఖిల్. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు. సినిమా కథలోకి వెళ్తే.. ఫస్ట్‌హాఫ్‌లో ప్లేబాయ్‌గా కనిపించే అఖిల్ ప్రతి అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఇలా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడిగా అఖిల్ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తాడు. కాగా తనను ప్రేమించేవాడు సిన్సియర్‌గా ఉండాలని కోరుకుంటుంది నిధి అగర్వాల్. కట్ చేస్తే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారుతుంది. అయితే జీవితాంతం ప్రేమించడం సాధ్యం కాదని నిక్కీతో బ్రేకప్‌ చేస్తాడు విక్కీ. మంచి ఎమోషనల్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్‌ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్‌తో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. తన ప్రేమను దక్కించుకునేందుకు విక్కీ చేసే ప్రయత్నాలు కొంతమేర మెప్పించాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇది టూమచ్‌గా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వీరిద్దరు కలిసే పాయింట్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. ఓవరాల్‌గా యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా Mr.మజ్ను చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

అఖిల్ వెయిట్ చేసిన సక్సెస్ ఈ సినిమాతో దక్కించుకున్నాడని చెప్పొచ్చు. కానీ బ్లాక్‌బస్టర్‌ రేంజ్ సక్సెస్‌కు కావాల్సిన కంటెంట్ మాత్రం ఈ సినిమాలో లేదు. కేవలం యూత్‌ను టార్గెట్ చేసి సినిమా తీశారు చిత్ర యూనిట్. మొత్తానికి అఖిల్ తొలి సక్సెస్‌ను ఈ సినిమాతో అందుకున్నాడని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
అఖిల్ అక్కినేని ఈ సినిమాలో మనకు కొత్తగా కనిపిస్తాడు. సిక్స్ ప్యాక్‌ బాడీతో అలరించిన అఖిల్, యాక్టింగ్ పరంగా మెచ్యురిటీ కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఫర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు వారి పరిధిమేరకు బాగా నటించారు.
2
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
Mr.మజ్ను సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. తొలిప్రేమ వంటి రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌ తరువాత వెంకీ చేసిన ఈ సినిమా అటు యూత్‌‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. సింపుల్ కథను మనకు చూపించిన విధానంతో వెంకీ తన ట్యాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. ముఖ్యంగా మూడు పాటలు ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్పెషలిస్ట్ అని థమన్‌ను ఎందుకంటారో ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనితనం బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉండటంతో సినిమా బాగా రిచ్‌గా కనిపిస్తుంది.

చివరగా:
Mr.మజ్ను – అక్కినేని వారసుడి తొలి హిట్

రేటింగ్:
3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news