Gossipsఎన్టీఆర్ ని దెబ్బకొట్టేందుకు అఖిల్ ప్లాన్..!

ఎన్టీఆర్ ని దెబ్బకొట్టేందుకు అఖిల్ ప్లాన్..!

త్రివిక్రం డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. అనుకున్న విధంగా దసరా బరిలో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. అందుకే అక్టోబర్ 10 రిలీజ్ డేట్ లాక్ చేశారు.

అసలే దసరా ఆ పైన క్రేజీ కాంబినేషన్ ఈసారి కూడా తారక్ దసరా హంగామా షురూ చేస్తాడని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు పోటీగా అక్కినేని యువ హీరో అఖిల్ వస్తున్నాడు. అఖిల్, హలో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో తొలిప్రేమ లాంటి క్రేజీ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు అఖిల్.

ఆగష్టు కల్లా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో ఫుల్ ప్రమోషన్స్ చేసుకుని అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈసారి దసరాకి తారక్ ను ఢీ కొడుతున్నాడు అఖిల్. కచ్చితంగా ఈ పోటీ రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news