Newsఫ్లైట్ లో అఖిల్.. ఆ ప్రపోజల్ కు భయంతో పరుగెత్తాడట..!

ఫ్లైట్ లో అఖిల్.. ఆ ప్రపోజల్ కు భయంతో పరుగెత్తాడట..!

అక్కినేని నట వారసుడు అఖిల్ మొదటి సినిమా నిరాశ పరచగా రెండో సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని ఏడాదిన్నర దాకా వెయిట్ చేసి మరి 24 విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నాగార్జున నిర్మాణంలో వస్తుంది. ఇక ఈమధ్య శ్రీయతో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న అఖిల్ రీసెంట్ గా రానా హోస్ట్ గా నడుస్తున్న నెంబర్ 1 యారి షోకి గెస్ట్ గా వచ్చాడు.

సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో అఖిల్, రానాలు ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేశారు. అయితే రీసెంట్ గా తనకు జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి అఖిల్ చెప్పాడు. తాను ఫ్లైట్ లో నిద్రపోయి లేచి చూడగా తన ముందు పేపర్ లో నువ్వు చాలా హాట్ గా ఉన్నావ్ నువ్వు ఓకే అంటే నేను రెడీ అని రాసుంది. అయితే అది రాసింది ఒక అబ్బాయని అది చూసి తనకు చాలా ఖంగారు వేసిందని అన్నాడు అఖిల్.

ఇక ఫ్లైట్ ల్యాండ్ అవగానే చకచకా వచ్చేశానని అన్నాడు. ఎక్కడ లెటర్ రాసిన అతను ఎదురుగా వస్తాడో అని అఖిల్ భయంతో పరుగెత్తాడట. మొత్తానికి అఖిల్ ను అలా భయపెట్టాడు ఓ కుర్రాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా అప్పుడప్పుడు సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తున్న ఈ షో సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news