Gossipsఅఖిల్ – చైతు మ‌ధ్య మొదలైన వివాదం..?

అఖిల్ – చైతు మ‌ధ్య మొదలైన వివాదం..?

అక్కినేని ఫ్యామిలీ నుండి నేటి తరం వారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య, అఖిల్ ఎవరికి వారు తమ సత్తా చాటుతున్నారు. నాగ చైతన్య లవ బోయ్ ఇమేజ్ సంపాదించగా అఖిల్ స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే అఖిల్ రీసెంట్ హలో సినిమా ఓవర్సీస్ లో నాగ చైతన్య సినిమా వసూళ్లను సైతం క్రాస్ చేసింది. అయితే ఆ కలక్షన్స్ చూపిస్తూ అన్నను మించిన తమ్ముడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదో రకంగా అన్నదమ్ముల మధ్య దూరం పెంచే ప్రేరణే అనిపిస్తుంది. చైతు కెరియర్ లో మంచి హిట్ సినిమాలే ఉన్నాయి. ఇక అఖిల్ కేవలం రెండు సినిమాలే చేశాడు. అందులో ఒకటి ఫ్లాప్ మరొకటి మాములు టాక్ తో నడుస్తుంది. మరి ఈ టైంలో అఖిల్ ఎలా చైతుని క్రాస్ చేసి వెళ్తాడని కొందరు అంటున్నారు. అఖిల్ హలో ఓవర్ సీస్ లో 833వేల డాలర్ల కలక్షన్స్ సాధించింది. చైతు ప్రేమం 829 డాలర్లే వసూలు చేసింది.

అందుకే ఈ పోలిక అంటున్నారు. అయితే ఓవరాల్ గా అఖిల్ 1 మిలియన్ డాటడం కష్టమే అన్నట్టు ఉంది. విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన హలో సినిమాను నాగార్జున స్వయంగా నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news