45 ఏళ్ల వయసులో వేడిపుట్టిస్తున్న ఐశ్వర్య..! (ఫోటోలు)

Aishwarya rai latest photoshoot

విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు.. ఈ వయసులో కూడా ఉర్రూతలూగించే అందాలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది ఐశ్వర్య రాయ్. ప్రస్తుతం సినిమాలను తగ్గించినా తన ఫ్యాన్స్ కు ఫోటో షూట్స్ ద్వారా సర్ ప్రైజ్ ఇస్తున్న ఐశ్వర్య రాయ్ లేటెస్ట్ గా డబు రత్నాని క్యాలెండర్ లో దుమ్ముదులిపే అందాలతో వచ్చింది. ఈ ఫోటో షూట్స్ చూస్తే ఐశ్వర్య అందం ముందు ఇప్పటితరం హీరోయిన్స్ కూడా పనికిరారు అన్నట్టుగా ఉంది.

బాలీవుడ్ హీరోయిన్ గా ప్రేక్షకులను ఇన్నాళ్లు తన సినిమాలతో అలరించిన ఐశ్వర్య రాయ్.. ఇప్పటికి తనలో ఆ ఛార్మింగ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పకనే చెబుతుంది. అయితే అమితాబ్ కోడలిగా సినిమాలో ఆమె శృతి మించి నటించే అవకాశం ఉండదు. అందుకే ఇలా ఫోటో షూట్స్ తో సరిపెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా ఐశ్వర్యా రాయ్ తర్వాతే వారెవరైనా అనేలా తన అందచందాలతో అలరిస్తుంది అమ్మడు. సినిమాల్లో కూడా ఈ ఉత్సాహం చూపించి తన ఫ్యాన్స్ ను మరింత సంతోషపరచాలని ఆశిద్దాం.

Leave a comment