అజ్ఞాతవాసి.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్..!

agnathavasi closing collections

భారీ అంచనాలతో త్రివిక్రం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి అంచనాలను అందుకోలేదు. సినిమా టాక్ ఎలా ఉన్నా కనీసం పవన్ రేంజ్ కు తగినట్టు కలక్షన్స్ అయినా వస్తాయనుకోగా రెండో రోజు నుండే అజ్ఞాతవాసి చేతులెత్తేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ అన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల దాకా జరుగగా ఇప్పటివరకు సినిమా కేవలం 57.88 కోట్లనే కలెక్ట్ చేసిందట.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫ్లాప్ అటు త్రివిక్రం, ఇటు పవన్ కళ్యాణ్ కు తీవ్రమైన దెబ్బ వేసింది.

నైజాం : 10.40 కోట్లు
సీడెడ్ : 5.30 కోట్లు
వైజాగ్ : 5.80 కోట్లు
గుంటూర్ : 5.13 కోట్లు
ఈస్ట్ : 4.25 కోట్లు
వెస్ట్ : 4.75 కోట్లు
కృష్ణా : 3.35 కోట్లు
నెల్లూరు : 2.25 కోట్లు

ఏపి, తెలంగాణా టోటల్ : 41.23 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 7.60 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 9.05 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా.. 57.88 కోట్లు

” రంగస్థలం ” Offical TEASER

Leave a comment