అజ్ఞాతవాసి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్…

agnathavasi teaser release date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ నుండి ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 9న అజ్ఞాతవాసి టీజర్ రిలీజ్ ఫిక్స్ చేశారట. ఇక ఈ నెల 15న ఆడియో వేడుకను రిలీజ్ చేస్తారట. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

బయటకొచ్చి చూస్తే సాంగ్ తో అభిమానులను అలరించిన అనిరుద్ సినిమాకు క్రేజీ మ్యూజిక్ అందించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో అనిరుద్ ఊపు ఊపేయడం ఖాయమని అంటున్నారు. ఇక స్పెషల్ గా టీజర్ లో కూడా తన టాలెంట్ చూపించేశాడట. సినిమా పోస్టర్ లో పవన్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయిన ఫ్యాన్స్ ఇక టీజర్ లో పవర్ స్టార్ ఎలా కనిపిస్తాడా అని ఎక్సయిటింగ్ గా చూస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా 2018 జనవరి 10న రిలీజ్ ఫిక్స్ చేశారు. యూఎస్ లో 209 సెంటర్స్ లో ఇండియన్ సినిమాల్లోనే అత్యధిక సెంటర్స్ లో రిలీజ్ అవుతున్న అజ్ఞాతవాసి సంచలన రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a comment