అజ్ఞాతవాసి ప్లస్సులు.. మైనస్సులు..! లాభమా… నష్టమా…

agnathavasi positive and negative

పవన్, త్రివిక్రం సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు నిరూపించాయి. అయితే రిలీజ్ అయిన అజ్ఞాతవాసి మాత్రం త్రివిక్రం పెన్ను పవర్ తగ్గినట్టు అనిపించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదని చెప్పొచ్చు. పవన్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలున్నా సగటు ప్రేక్షకుడిని అలరించేలా స్క్రీన్ ప్లే లేదు.

ముఖ్యంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమా రిచ్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే భారీగా ఉన్నాయి. సినిమాలో త్రివిక్రం డైలాగ్స్ వాడినంతవరకు బాగానే ఉన్నాయి. ఇక పవన్ స్టైలిష్ యాక్షన్ కూడా బాగుంది. సినిమాకు మెయిన్ పాయింట్ అది కాపీనా, స్పూర్తి కథా అన్నది పక్కన పెడితే అది మాత్రం బలమైనదే. టాక్ ఎలా ఉన్నా పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాను పండుగ చేసుకోవడం ఖాయం.

ఇక మైనస్సుల విషయానికొస్తే.. సినిమా కాస్ట్ అండ్ క్రూ భారీగా ఉన్నా వారిని ఎవరిని సరిగా వాడుకోలేదు. హీరోయిన్స్ అయితే మరి ఫూలిష్ గా అనిపిస్తారు. రావు రమేష్, మురళి శర్మలను జోకర్లుగా చూపించారు. సినిమా కథ పాతదే అయినా దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం అసలు బాగాలేదు. సైకిల్ ఎపిసోడ్ సినిమాను డిస్ట్రబ్ చేసింది. సీరియస్ సబ్జెక్ట్ ను ఇంత దారుణంగా తీస్తారా అంటూ త్రివిక్రం మీద కూడా తప్పులు చేస్తాడా అని ప్రేక్షకుల కామెంట్స్.

మొత్తానికి రాజకీయ ప్రస్థానం ప్రారంభించబోతున్న పవన్ కళ్యాన్ ఇలాంటి సినిమాల కన్నా సమాజానికి ఉపయోగపడే సినిమాలను అందిస్తే బెటర్ అని ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటున్నారు.

అజ్ఞాతవాసి మొదటి రోజు కలక్షన్స్.. పవర్ స్టార్ స్టామినా ఇది..!

Leave a comment