“అజ్ఞాతవాసి” అజ్ఞానంలోకి వెళ్లడానికి కారణాలు..

agnathavasi flop

పవన్ కళ్యాన్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా లో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు. మరి భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా గురించి అందుకు నెగటివ్ టాక్ వచ్చిందో తెలుసుకుందాం.
వెళ్ళేటప్పుడు గ్లూకోస్ ప్యాకెట్ తో వెళ్ళాలి. రిటర్న్ వచ్చేటప్పుడు అమూర్తన్జన్ తో రావాలి .
అజ్ఞ్యాతవాసం కి వెళ్లిన అవి అవసరం లేదు అనుకుంట .బట్ అజ్ఞ్యాతవాసి మూవీ కి వెళ్తే మాత్రం అవి తప్పనిసరి. అంత కష్టపడి వెళ్ళటం ఎందుకు అనుకుంటున్నారా.? బేసిక్ గా మనం సినిమా లవర్స్ కదా. మూవీ ఎలా ఉన్నా మనం వెళ్ళటం పక్కా. అందులో త్రివిక్రమ్ గారి సినిమా అంటే కొద్దిగా అంచనాలు ఎక్కువే. ఇంతకీ అజ్ఞాతవాసి సినిమా నచ్చకపోవటానికి గల కారణాలు ఏంటి అని ఓ సారి చూద్దాం.

#1. పవన్ కళ్యాణ్ సినిమా లాగా అనిపించింది. కానీ త్రివిక్రమ్ మార్క్ మాత్రం సినిమాలో ఎక్కడా కనిపించలేదు. అక్కడక్కడా రెండు మూడు డైలాగ్స్ మాత్రమే వచ్చాయి.

#2. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ లో మాదిరిగానే కొన్ని అమ్మాయిలాగా వేషాలు వేశారు పవన్ కళ్యాణ్. ఒకసారి హిట్ అయ్యిందని ప్రతిసారి రిపీట్ చేస్తే చిరాకు వస్తుంది.

ముఖ్యంగా ఆ బెల్ట్ తో కొట్టే సీన్ కి నవ్వాలో వద్దో కూడా అర్ధం కాలేదు ఆడియన్స్. అంత చిల్లరగా అనిపించింది కామెడీ.

#3. సినిమాలో మినిమం కామెడీ ఉంటది అనుకున్నాము. కానీ భూతద్దం పెట్టి వెతికినా దొరకలేదు.

#4.

స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది.కానీ తెరకెక్కించడంలో విఫలం అయ్యారనే చెప్పాలి

#5. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది సంగీతం గురించి. పవన్ కళ్యాణ్ గత చిత్రాల్లో పాటలు ఎంతగా హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బయటకొచ్చి చూస్తే, గాలి వాలుగా పాటలు ఆడియో పరంగా ఆకట్టుకున్నాయి..కానీ విసుఅల్స్ ఆకట్టుకోలేకపోయాయి.

అనవసరంగా ఫారిన్ లొకేషన్స్ ఎందుకో.? ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.

#6. ఈ సినిమాలో పేరుకి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఎందుకు ఉన్నారో వారికి కూడా తెలీదు.

Leave a comment