ఆ బాలీవుడ్ సినిమా తర్వాత అజ్ఞాతవాసే.. డిజాస్టర్ లో రికార్డ్..!

agnathavasi cinima disaster details

పవన్ అజ్ఞాతవాసి సినిమా దాదాపు కలక్షన్స్ క్లోజ్ అయినట్టే. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా వచ్చిన అజ్ఞాతవాసి ఏమేరకు అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలక్షన్స్ ఎలా ఉన్నా తర్వాత రోజు నుండి ఢీలా పడిపోయింది. త్రివిక్రం మార్క్ ఎక్కడ పని చేయని ఈ సినిమా డిజాస్టర్స్ లో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

అది కూడా ఓ బాలీవుడ్ సినిమా తర్వాత స్థానాన్ని సంపాదించుకుంది. అదెలా అంటే.. అజ్ఞాతవాసి సినిమా 127 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా ఇప్పటివరకు 58 కోట్ల వరకే కలెక్ట్ చేయగలిగింది. అంటే దాదాపు 70 కోట్ల దాకా లాస్ అన్నమాట. ఇక ఇలానే భారీ అంచనాల మధ్య వచ్చిన బాంబే వెల్వెట్ సినిమా కూడా 100 కోట్ల నష్టాలను చూసింది. ఇప్పుడు అందరు అజ్ఞాతవాసి సినిమాను బాంబే వెల్వెట్ సినిమాతో పోల్చుతున్నారు.

తొలిరోజు 40 కోట్ల షేర్ సంపాదించిన అజ్ఞాతవాసి ఆ తర్వాత 15 రోజుల్లో కేవలం 18 కోట్లనే రాబట్టింది అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అన్నది అర్ధం చేసుకోవచ్చు. స్టార్ సినిమా అంచనాలను అందుకుంటే రికార్డులే అదే అంచనాలు తారుమారైతే మాత్రం ఇలాంటి డిజాస్టర్లనే చూడాల్సి వస్తుంది.

Leave a comment