Gossipsటెన్షన్ లో పవన్ ఫ్యాన్స్‌.. 'అజ్ఞాతవాసి' ఆగిపోయే ఛాన్స్‌..!!

టెన్షన్ లో పవన్ ఫ్యాన్స్‌.. ‘అజ్ఞాతవాసి’ ఆగిపోయే ఛాన్స్‌..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఓ పక్క జనవరి 10న రిలీజ్ ఏర్పాట్లు జరుగుతుండగా మరో పక్క సినిమా రిలీజ్ పై డౌట్లు రేజ్ అవుతున్నాయి. అజ్ఞాతవాసి సినిమా ఫ్రెంచ్ లార్గో వించ్ స్పూర్తిగా తెరకెక్కించారని అంటుండగా ఆ సినిమా దేశంలో అన్ని భాషల రైట్స్ టి-సీరీస్ వారు సొంతం చేసుకున్నారు.

ఇక ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ నుండి అజ్ఞాతవాసి యూనిట్ కు నోటీసులు వచ్చాయని తెలుస్తుంది. అజ్ఞాతవాసి పూర్తి కథ చెప్పేందుకు దర్శక నిర్మాతలు నిరాకరించగా సినిమా అలా అయితే సినిమా రిలీజ్ కానివ్వకుండా అడ్డుపడతారని అంటున్నారు. అనూహ్యంగా ఏర్పడిన ఈ పరిణామాల నుండి అజ్ఞాతవాసి ఎలా బయటపడతాడో చూడాలి.

సినిమా రిలీజ్ హంగామా ఓ పక్క జరుగుతున్నా వివాదం మరింత ఉచ్చు బిగుసుకుంటుందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే టి సీరీస్ కు సన్నిహితంగా ఉండే రానా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకున్నాడని తెలుస్తుంది. మరి అనుకున్నట్టుగా అజ్ఞాతవాసి రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు ఎదురవ్వవా.. లేదా అనుకోని పరిణామాలు జరుగుతాయా అన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news