ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మెగా హీరోలు..

maga heroes

మెగా హీరోలు కాశీ బాట పట్టారు. ఒకరు వెనుక ఒకరు కాశీ వెళ్తున్నారు. ఏంటి పుణ్యక్షేత్రాలు చూడ్డానికి అనుకున్నారా ..? అయితే పప్పులో కాలేసినట్టే. వాళ్ళు వెళ్ళేది పుణ్యం కోసం కాదు. షూటింగ్ ల కోసం.
మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘ఇంద్ర’.. మేజర్ ఎపిసోడ్ చిత్రీకరణ అంతా వారణాసిలోనే జరిగింది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు.. ‘భం భం భోలే శంఖం మోగేలే’ పాటలో హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీని అద్భుతంగా ప్రేక్షకులకు చూపించారు.

చిరంజీవి కాశీ సెంటిమెంట్‌ను ఆయన పుత్రుడు రామ్‌చరణ్ కూడా ఫాలో అయ్యాడు. వినాయక్ దర్శకత్వంలో చరణ్ డ్యూయెల్ రోల్‌లో మెప్పించిన ‘నాయక్’ చిత్రంలో కాశీ లోని కుంభమేళాను చూపించారు. ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలచింది. తండ్రీ కొడుకులు చిరంజీవి-చరణ్ కు అచ్చొచ్చిన కాశీ సెంటిమెంట్ పవన్‌ కళ్యాణ్‌కు మాత్రం కలసిరాలేదు.

పవన్ ‘తీన్‌మార్’ సినిమాలోని అర్జున్ పాల్వాయ్ పాత్ర మొత్తం కాశీలోనే సాగుతుంది. తాజాగా పవన్‌కళ్యాణ్ ‘అఙ్ఞాతవాసి’ కోసం మళ్ళీ కాశీకి పయనం అయ్యాడు. ఇటీవలే యూరప్‌లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వారణాసిలోనూ చిత్రీకరణ జరుపుకుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటైన కాశీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు అదృష్టరేఖగా మారిపోయింది. తాజాగా పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ కాశీ బాట పట్టడమే దీనికి నిదర్శనం.

Leave a comment