అజ్ఞాతవాసికి దెబ్బేయనున్న జై సింహా..!

agnathavasi and jai simaha
ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అంతా బాగున్నా ఎక్కడో ఏదో లాజిక్ మిస్ అయినట్టు తెలుస్తుంది. సినిమా హిట్ టాక్ బలంగా వినిపించకపోవడం విశేషం. అయితే డివైడ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అవట్లేదు.
ఇక ఈ సినిమా తర్వాత జై సింహా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అజ్ఞాతవాసికి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. బాలయ్య మార్క్ సినిమాగా వస్తున్న ఈ జై సింహా మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ అందిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే బాలయ్య పవన్ కు కచ్చితంగా దెబ్బేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
స్టార్ సినిమా అయినా బాగుంటే ఏం లేదు.. బాగా లేకుంటే థియేటర్ల నుండి త్వరగానే తీసేస్తారు. ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి అన్ని థియేటర్స్ లో ఆడుతుండగా జై సింహా హిట్ అయితే మాత్రం కొన్ని థియేటర్స్ మార్చే అవకాశం ఉంది. బాలయ్య గర్జిస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటే కచ్చితంగా పవన్ కు దెబ్బ పడటం ఖాయమని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది చూడాలి.

Leave a comment