విజయవాడ లోదందా గా మారిన స్పైడర్ మూవీ

about mahesh babu spyder

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన స్పైడర్ కు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో మహేష్ మొదటిసారి తమిళ మార్కెట్లోకి దిగుతున్నాడు.ఈ వారం విడుదల కాబోతున్న ‘స్పైడర్’ మూవీ కథ పై ఇప్పటికే రకరకాల కథనాలు ఊహాగానాలుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

విజయవాడలో పెద్ద సినిమాలకు మొదటి రోజు టికెట్లు లభించడం అంటే. టీమిండియా వరల్డ్ కప్ కొట్టినట్లే..! అవును. విజయవాడలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సినిమా టికెట్ల మాయాజాలం అలాంటిది మరి.ప్రస్తుత పరిస్థితికే వస్తే. బుధవారం విడుదల కాబోతున్న “స్పైడర్” సినిమాకు సంబంధించి అడ్వాన్సు బుకింగ్స్ దాదాపుగా ఏపీ, తెలంగాణాలోని అన్ని ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి, ఒక్క విజయవాడలో తప్ప! కేవలం రెండంటే రెండు రోజులు ఉంచుకుని కూడా ఇంకా టికెట్లు ఎందుకు ఓపెన్ కాలేదన్న విషయం సినీ ప్రేక్షకులకు అంతుపట్టదు. అయితే అసలు ఓపెన్ కాకుండా ఉంటుందా? అంటే ఉండదు. ఏదో అర్ధరాత్రి సమయాలలో ఓపెన్ చేసినట్లుగా చెప్తారు, ఓపెన్ చేసిన వెంటనే టికెట్లు కూడా అయిపోయాయని ప్రకటిస్తారు.

విజయవాడలో సినిమా టికెట్లు అనేది ఒక దందాగా మారింది. టికెట్ లభించాలంటే. డిపార్టుమెంటు ద్వారా గానీ లేక రాజకీయ ఆధిపత్యం ద్వారా గానీ లేక ధియేటర్ లో తెలిసిన వారుంటే కానీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

‘పలుకుబడి’ ఉంటేనే విజయవాడలో ‘ఫస్ట్ డే టికెట్,’ లేదంటే బ్లాక్ దందా రాయుళ్ళ చేతిలో సినీ ప్రేక్షకులు బలి కావాల్సిందే. గతంలో ఓ వారం రోజుల పాటు సాగే ఈ దందా, ప్రస్తుతం ఒక్క రోజుకే పరిమితం అయ్యింది. ఒకవేళ ‘బాహుబలి 2’ మాదిరి భారీ పాజిటివ్ టాక్ వస్తే. ఇక అంతే..! టాక్ సినిమాకు అనుకూలంగా రాని పక్షంలో, వెంటనే రెండవ రోజు నుండి ఆన్ లైన్ లో బోలెడు టికెట్లు ప్రత్యక్షం అవుతాయి.

Leave a comment