పాపం షారుక్.. ట్రైలర్ తోనే సరిపెట్టుకుంటాడా..

68

బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్షా షారుఖ్ ఈమధ్య బీ టౌన్ లో ఆయన సందడి ఏమాత్రం లేదని చెప్పాలి. సినిమాలైతే చేస్తున్నాడు కాని షారుఖ్ రేంజ్ హిట్ కొట్టడంలో వెనుకపడ్డాడు. ఓ పక్క సల్మాన్, ఆమీర్, అక్షయ్ కుమార్ లు వరుస విజయాలతో దూసుకెళ్తుంటే షారుఖ్ మాత్రం సైలెంట్ అయ్యాడు.
2
ప్రస్తుతం షారుఖ్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జీరో. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే రిలీజై సంచలనం సృష్టిస్తుంది. నవంబర్ 2న రిలీజైన జీరో ట్రైలర్ 12 రోజుల్లో 88 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈసారి షారుఖ్ కచ్చితంగా హిట్ కొట్టేలానే ఉన్నాడు. సినిమాలో షారుఖ్ షార్ట్ మెన్ గా నటిస్తుండగా అనుష్క శర్మ, కర్తినా కైఫ్ లు సినిమాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
1
మరి ట్రైలర్ తో హంగామా సృష్టిస్తున్న షారుఖ్ సినిమా ఫలితంలో ఆ జోష్ చూపిస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాను షారుఖ్ సొంతంగా నిర్మిస్తుండటం విశేషం. రెడ్ చిల్లీస్ బ్యానర్ లో షారుఖ్ భార్య గౌరీ ఖాన్ జీరో సినిమా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షారుఖ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Leave a comment