ఎన్టీఆర్ కి బ్రోకర్ గా మారిన రాశి కన్నా

ntr jai lava kusa movie

ప్రస్తుతం ఎక్కడ చుసిన , ఏనోట విన్న ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ చిత్రం గురించే. ఇందులో హీరోయిన్స్ గా రాశిఖన్నామరియు నివేదిత థామస్ నటిస్తున్నారు ,చిత్రంలో రాశిఖన్నా పాత్ర మాత్రం బ్రోకర్ గా నటిస్తుందట .  ఏంటి టైటిల్ చూసి తప్పుగా అనుకోకండి.మీము చెప్పేది సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి.ఊహలు గుసగుసలాడే చిత్రం తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచమైన ఈ ఢిల్లీ భామ , ఆ తర్వాత వరుస ఛాన్సులతో మంచి హిట్సే సొంతం చేసుకుంది. ఇక కెరియర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ చిత్రం లో నటించింది అదే జై లవకుశ. ఈ మూవీ లో ఎన్టీఆర్ లవ , కుశ , జై అనే మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

ఎన్టీఆర్ కు జోడిగా నటించిన ఈమె , ఈ మూవీ లో ప్రియ గా కనిపించబోతుంది. పెళ్లిళ్ల బ్రోకర్ (మ్యారేజ్ బ్యూరో) నిర్వాహకురాలి రోల్ లో కనిపిస్తుంది. లవకుమార్ ను ప్రేమించే అమ్మాయిగా అందరి మనసులను దోచుకుంటుందట. ఈ మూవీ తనకెంతో ప్రత్యేకం అంటుంది. దసరా కు జై లవకుశ లో హీరోయిన్ గా వచ్చి , దీపావళి రాజా ది గ్రేట్ లో ఐటెం భామగా మెప్పించనుంది. మొత్తానికి రెండు పండగలకు రాశి థియేటర్స్ లలో సందడి చేయనుంది. ఈ రెండు చిత్రాల తర్వాత రాశి ఖన్నా వరుస ఆఫర్స్ తో బిజీ కావడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ఈమె మలయాళం , తమిళం లో ఒక్కో సినిమా చేస్తుంది.జై లవకుశ చిత్రం దెబ్బకి రాశిఖన్నాకు టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళుతుంది అంటున్నారు  సినీ విశ్లేషకులు.

Leave a comment