జై లవ కుశ ఎందుకు అంత హిట్ అయింది?

jai lava kusa talk

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్ షోల సంద‌డితో రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా సంద‌డి స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు ఎక్క‌డిక‌క్క‌డ థియేట‌ర్ల వ‌ద్ద పోటెత్తారు. ఇక ప్రీమియ‌ర్ షోల త‌ర్వాత సినిమాకు హిట్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతోంది.

జై , లవ , కుశ అనే ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే  కధే ఈ మన జై లవ కుశ .ఓ బాంబ్ బ్లాస్ట్‌లో ముగ్గురు అన్న‌ద‌మ్మ‌లు చిన్నప్పుడే  విడిపోతారు. 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌ట్ చేస్తే ఈ ముగ్గురిలో ల‌వ చాలా అమాయ‌కుడైన బ్యాంక్ మేనేజ‌ర్‌  . ఇక కుశ  దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. ఓ రోజు జ‌రిగిన ప్ర‌మాదంలో ల‌వ‌, కుశ క‌లుసుకుంటారు. కుశ బ్యాంక్ మేనేజ‌ర్ అయిన ల‌వ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్క‌డ కుశ చేష్టలవల్ల  ల‌వ ఇబ్బందుల్లో ప‌డ‌తాడు.

జై రావ‌న్ అవ‌తారం ఎత్తి బైరాంపూర్‌లో ప్ర‌జ‌ల‌ను శాసించే కింగ్‌గా మార‌తాడు. మిగిలిన ఇద్దరు  బ‌తికే ఉన్నార‌న్న విష‌యం తెలుసుకున్న రావ‌న్ వారిని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేసాతడు. జై అంత క్రూరంగా ఎందుకు మారతాడు అనేదే అసలు కధ

త‌మ‌న్నా ఐటెం సాంగ్‌తో పాటు టెక్నిక‌ల్ వాల్యూస్‌, క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణ విలువ‌లు కూడా హిట్. ఓ కమర్షియల్ కథ‌లో ఇంత వినోదం, ఇన్ని మలుపులు, సెంటిమెంట్ చివరిదాకా ఉత్కంఠ, ఊహించని క్లైమాక్స్ …ఇవన్నీ కుదరడం బహు అరుదు. ఇవన్నీ ఉంటూనే ఓ నటుడి విశ్వరూపాన్ని చూపే పాత్ర సృష్టించడం ఇంకా అరుదు.

ఇక సినిమాలో ఫ‌ట్ విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు బాబి ఓ వీక్ క‌థ‌ను బేస్ చేసుకుని, క్యారెక్ట‌రైజేష‌న్ల మీద బేస్ అయ్యి సినిమాను తెర‌కెక్కించ‌డం పెద్ద మైన‌స్‌. సినిమాలో బల‌మైన క‌థ కంటే క్యార‌క్ట‌రైజేష‌న్లే డామినేట్ చేస్తాయి. ఫ‌స్టాఫ్‌లో జై క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అయ్యేవ‌ర‌కు క‌థ‌నాన్నిచాలా సాధార‌ణంగా న‌డిపాడు. ఆ సీన్ల‌న్ని అంత ఎంగేజింగ్‌గా అనిపించ‌వు.

ప్లస్ పాయింట్స్ (+):

 

జై క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం

 

ల‌వ పాత్ర‌లో కుశ ఎంట్రీ

 

ఇంట‌ర్వెల్ బ్యాంగ్ 

 

క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణ విలువ‌లు

 

సాంకేతికంగా ఉన్న‌త విలువ‌లు పాటించ‌డం

 

సెకండాఫ్

 

స్క్రీన్ ప్లే

 

డైరెక్ష‌న్

 

మైన‌స్ పాయింట్స్ (-):

 

లాగ్ సీన్లు 

 

విడివి 

 

పాత కథ

 

 

Leave a comment