బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా ?

bigg boss  ntr

హిందీ బిగ్ బాస్ సక్సెస్ తో తెలుగు , తమిళ్ లో షో ని స్టార్ట్ చేసారు , తమిళ్ లో కమల్ హాసన్ , తెలుగు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నవిషయం తెలిసిందే . తమిళ్ లో ఈ షో కి అంత ఆదరణ రాలేదు . మన తెలుగు లో మాత్రం సూపర్ ఆదరణ వచ్చిందనే చెప్పాలి . ఈ సక్సెస్ కి ముఖ్య కారణం ఎన్టీఆర్ ,  తన మాటల మాయాజాలంతో తనదైన శైలిలో తెలుగు బిగ్ బాస్ ను రక్తి కట్టించారు. బుల్లి తెర ప్రేక్షకులని టీవీలకు కట్టిపడేసింది బిగ్ బాస్ .

గత 10 వారాలుగా ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి  చేరుకుంది. ఫైనల్ విన్నర్ ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది .దీంతో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. శని – ఆదివారాల్లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న ఎన్టీఆర్ ….ఫైనల్ ఎపిసోడ్ లో ఏకధాటిగా నాలుగు గంటలపాటు సందడి చేయబోతున్నాడట. అయితే ఈ ఫైనల్ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా ప్రిన్స్ మహేష్ బాబును పిలవాలని ప్లాన్ చేశారట. కానీ అనివార్య కారణాల వల్ల ప్రిన్స్ రావడం లేదట. తాజాగా ఈ గ్రాండ్ ఫినాలేకు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది.

బుల్లి తెర ప్రేక్షకులను  కొన్ని వారాలుగా ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులందరూ సందడి చేయబోతున్నారట. వారందరూ హౌస్ లో తమ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ను పంచుకోబోతున్నారట. ఈ ఫైనల్ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా నాగ్ రాబోతున్నారని సమాచారం. నాగ్ కు ఎన్టీఆర్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. అంతే కాకుండా స్టార్ మా యాజమాన్యంతో నాగ్ కు సాన్నిహిత్యం ఉంది. ఈ కారణాల వల్లే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు నాగార్జున రావడం కన్ ఫర్మ్ అని టాలీవుడ్ లో వినికిడి. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో రాణా – తాప్సీ – అల్లరి నరేష్ – సచిన్ జోషి – జై లవ కుశ టీం సందడి చేసి తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. స్పైడర్ సినిమా ఈ నెల 27 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో ఫైనల్ ఎపిసోడ్ కు మహేష్ స్పెషల్ గెస్ట్ గా వచ్చి తన సినిమాను ప్రమోట్ చేసుకుంటాడని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రిన్స్ రాలేకపోతున్నాడట. అక్టోబర్ 13న నాగ్ నటించిన రాజు గారి గది-2 విడుదల కాబోతోంది. దీంతో ఈ ఫైనల్ ఎపిసోడ్ కు నాగ్ చీఫ్ గెస్ట్ గా వచ్చి తన సినిమాను ప్రమోట్ చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ షోకు నాగ్ వస్తారా? లేదా? అన్న విషయం తెలియాలంటే మరో రోజు వేచి చూడాల్సిందే!

Leave a comment