అంచనాలు పెంచుతున్న ‘ఏబీసీడీ’ ట్రైలర్!

ABCD Trailer

మెగా హీరోలు ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో అల్లు వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. బన్ని తమ్ముడు అల్లు శిరీష్ ‘గౌరవం’సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన కొత్తజంట కాస్త పరవాలేదు అనిపించింది. ఇటీవల అల్లు శిరీష్ నటించిన ఏ సినిమా పెద్దగా విజయాలు అందుకోలేదు.

తాజాగా అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అన్నది ఉపశీర్షిక. రుక్సార్‌ ధిల్లన్‌ కథానాయికగా నటించారు. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా.. ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘హాయ్‌ నా పేరు అవి. నేను జీవితంలో మూడు ‘E’లను ఫాలో అవుతుంటాను. ఎంజాయ్‌మెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎగ్జైట్‌మెంట్‌’ అంటూ శిరీష్‌ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది.

లవ్ .. ఫ్రెండ్షిప్ .. కామెడీపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. తాను లైఫ్ లో ఎంజాయ్ మెంట్ .. ఎంటర్టైన్మెంట్ .. ఎక్సయిట్ మెంట్ నే కోరుకుంటానంటూ హీరోతో చెప్పించిన డైలాగ్ ఆయన స్వభావానికి అద్దం పడుతోంది.హీరో స్నేహితుడిగా భరత్ మంచి సందడి చేస్తాడని ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మాస్ ను ఆకట్టునే అంశాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగానే ఉన్నాయనిపిస్తోంది. కథలో రాజకీయాల కోణం కూడా ఉండటం విశేషం. కోట శ్రీనివాసరావు .. శుభలేఖ సుధాకర్ .. నాగబాబు .. వెన్నెల కిషోర్ .. కీలకమైన పాత్రలను పోషించారు.

Leave a comment