ఏబిసిడి ట్రైలర్.. అమెరికా అబ్బాయి ఇండియా కష్టాలు..!

78

అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏబిసిడి. రుక్సార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్ హాల్ లో జరిగింది. నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా అటెండ్ అయిన ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా ఏబిసిడి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఈసారి అల్లు శిరీష్ హిట్టు కొట్టేలానే ఉన్నాడనిపిస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగిన హీరో ఇండియాలో ఎలా బ్రతుకుతాడు.. ఎన్ని కష్టాలు పడతాడు అన్నది సినిమా కథ.

అల్లు శిరీష్ చాలా ఈజ్ తో ఈ పాత్ర చేశాడని అనిపిస్తుంది. శిరీష్ ఫ్రెండ్ క్యారక్టర్ లో భరత్ నటించాడు. సినిమాలో అతని రోల్ కూడా బాగుంటుందని తెలుస్తుంది. ఏబిసిడి ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా కచ్చితంగా ఆడియెన్స్ ను అలరించేలా ఉంటుందని చెప్పొచ్చు. మళయాళ సినిమాకు అఫిషియల్ రీమేక్ గా వస్తున్న ఏబిసిడి సినిమా అల్లు శిరీష్ కెరియర్ లో బెస్ట్ మూవీ నిలవాలని ఆశిద్దాం. ఈ సినిమా మళయాళ వర్షన్ చూసి రాం చరణ్ తనని రిఫర్ చేశారని అందుకే చరణ్ కు థ్యాంక్స్ అని అన్నారు అల్లు శిరీష్.

ఇక గెస్ట్ గా వచ్చిన నాని ఈ సినిమా మంచి విజయవంతం కావాలని ఆశించారు. అల్లు శిరీష్ లో ఓ చైల్డ్ నెస్ ఉంటుంది.. ఆయన అల్లు అరవింద్ కు ప్రొడక్షన్ లో వారసుడు అవుతాడని అనుకుంటే హీరోగా సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. సినిమా ఇంకా బాగుండాని అన్నారు.

Leave a comment