Gossipsఆటగాళ్లు టీజర్.. నారా హీరో కొట్టేలానే ఉన్నాడు..!

ఆటగాళ్లు టీజర్.. నారా హీరో కొట్టేలానే ఉన్నాడు..!

నారా రోహిత్ హీరోగా పరుచూరి మురళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆటగాళ్లు. జగపతి బాబు విలన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమాలో నారా రోహిత్ ఓ హీరోగా కనిపిస్తున్నాడు. భార్యని చంపిన కేసులో అతన్ని ఇంటరాగేట్ చేస్తుంటారు.

ఇక క్రిమినల్ లాయర్ గా జగపతి బాబు కనిపిస్తున్నారు. ఈమధ్య విలన్ గా సూపర్ ఫాంలో ఉన్న జగ్గూ భాయ్ విలన్ గా ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రావింద్రనాథ్, శివాజి ప్రసాద్, రాము, జితేంద్ర నిర్మిస్తున్నారు. టీజర్ అయితే సినిమాపై ఆసక్తి పెంచగా సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news