అమలాపాల్ కి దిమ్మతిరిగే షాక్..!

53

ఈ మద్య చాలా మంది హీరోయిన్లు ప్రయోగాత్మక సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపాల్ ప్రస్తుతం ‘ఆడై’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ మద్య ఓ టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ టీజర్ క్షణాల్లో బీభత్సం సృష్టించింది. ఎక్కడ చూసినా అమలాపాల్ గురించే టాక్ నడిచింది.

ఇంతకీ అమలా పాల్ గురించి అంతగా చర్చించాల్సి అంశం ఏంటా అంటారా..ఈ టీజర్ లో పూర్తి నగ్నంగా కనిపించడం. స్టార్ హీరోయిన్ ఇలాంటి సన్నివేశాల్లో నటించడంతో సినిమాకు హైప్ వచ్చేసింది. ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో మరికొన్ని బోల్డ్ సీన్లు ఉన్నట్లు సమాచారం.

దాంతో సెన్సార్ కత్తెర వేయడానికి సిద్ధమవుతోంది. ఈ సన్నివేశాలన్నింటినీ బ్లర్ చేసి చూపిస్తారట. లేదంటే సన్నివేశాలు తీసేయాల్సిన పరిస్థితి ఉందట. దీంతో దర్శకనిర్మాతలకు వేరే దారి లేదని తెలుస్తోంది. మరి ఈ సన్నివేశాలు తీస్తే సినిమాలో ఏం కిక్కు ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Leave a comment