సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లకు సక్సెస్ రేటు ఎంతో కీలకం. ఇక్కడ సక్సెస్ ఉన్న వాళ్ళదే రాజ్యం. సక్సెస్ లేనివాళ్లు ఆటోమేటిక్‌గా రేసులో వెనుకబడిపోతూ ఉంటారు. ఒకప్పుడు గోల్డెన్ లెగ్గా పాపులర్ అయిన హీరోయిన్లు పూజహెగ్డే – కృతిశెట్టి ఇప్పుడు ఐరన్ లెగ్ హీరోయిన్గా మారిపోయారు. ఇప్పుడు అంతా శ్రీలీల హవా నడుస్తోంది. ఇక 17 ఏళ్ల క్రితం మంచు మనోజ్ కు జోడిగా శ్రీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది మిల్కీ బ్యూటీ తమన్నా.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/08/Collage-Maker-16-Aug-2023-02-37-PM-4597-1-1024x538.jpg)
తమన్నా తన కెరీర్లో చాలా సినిమాలలో నటించింది. అలాగే స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. తాజాగా ఒక్క రోజు గ్యాప్‌లో ఆమె ఇద్దరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడిగా జైలర్ – చిరంజీవికి జోడిగా భోళా శంకర్ సినిమాలలో ఆమె నటించింది. అయితే ఈ రెండు సినిమాలలో ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/08/606ab73b-9d21-4f82-bc67-5c4e19e7ec53.jpeg)
ఇక స్టార్ హీరోలకు తమన్నా పెద్దగా కలిసి రాలేదు. బన్నీకి జోడిగా బద్రీనాథ్ – ఎన్టీఆర్‌కు జోడిగా ఊసరవెల్లి – ప్రభాస్ రెబల్ – మహేష్ బాబు ఆగడు – పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు – చిరంజీవితో సైరా, భోళా శంకర్ – గోపీచంద్ తో సీటిమార్ – కళ్యాణ్ రామ్ తో నా నువ్వే – నితిన్‌తో మ్యాస్ట్రో – రామ్‌తో ఎందుకంటే ప్రేమంట సినిమాలు చేస్తే అవన్నీ డిజాస్టర్ అయ్యాయి.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/08/9955794a-8a0f-4694-b2f8-42685e2923a6.jpeg)
ఇలా స్టార్ హీరోలకు ఆమె ఏమాత్రం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే భోళా శంకర్ సినిమాలో తమన్నాను హీరోయిన్గా వద్దని కొందరు ఇండస్ట్రీ జనాల సూచించినా చిరు వాళ్ళ మాట పట్టించుకోకుండా ఆమెని హీరోయిన్గా పెట్టారు. చిరు కావాలనే పట్టుబట్టి మరీ తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నారట. చివరకు ఆ సెంటిమెంట్ నిజం అయి భోళా శంకర్ డిజాస్టర్ అయింది.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/08/e53d6726-1ecd-4be6-a920-7d3d794405bc.jpeg)