Moviesతమ్ముడు డిజాస్టర్ రికార్డ్ ని బ్రేక్ చేసిన అన్నయ్య.. మొదటి రోజు...

తమ్ముడు డిజాస్టర్ రికార్డ్ ని బ్రేక్ చేసిన అన్నయ్య.. మొదటి రోజు “కస్టడి” దారుణమైన కలెక్షన్లు..ముఖం ఎక్కడ పెట్టుకుంటారో..?!

అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం “కస్టడి”. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరరికెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . కాగా సినిమాకి ముందు నుంచి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురుచూశారు. ఎందుకంటే అక్కినేని నాగార్జున – అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ సినిమాలు రెండు డిజాస్టర్ కావడంతో హోప్స్ అన్ని అక్కినేని నాగచైతన్య పైనే పెట్టుకున్నారు అక్కినేని ఫ్యాన్స్.

అయితే తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచిందా అన్నట్లు అక్కినేని నాగచైతన్య నటించిన “కస్టడి” సినిమా కూడా డిజాస్టర్ గా మారింది . సినిమా పరంగా బోరింగ్ కథగా ఉండడం జనాలకు పెద్దగా నచ్చలేదు. అక్కినేని ఫ్యాన్స్ కి కూడా ఓకే ఓకే గా అనిపించింది . ఈ క్రమంలోని సినిమాకు అలా పాజిటివ్ కాదు ఇలా నెగటివ్ టాక్ కాదు.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో ముక్కి ములుగుతూ ముందుకెళ్తుంది.

అక్కినేని నాగచైతన్య ఫస్ట్ డే సినిమా కలెక్షన్స్ బయటపడ్డాయి . మొదటి రోజు నైజాం ఏరియా చూస్తే నాగచైతన్య సినిమాకు 75 లక్షల మాత్రమే కలెక్ట్ చేయడం దారుణాతి దారుణంగా ఉంది . గుంటూరు ఏరియాలో 20 లక్షలు .. ఈస్ట్ గోదావరి 14 లక్షలు కలెక్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు దారుణాతి దారుణంగా నెల్లూరు ఏరియాలో తొమ్మిది లక్షల కలెక్ట్ చేసిందట . తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది . అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో కంపేర్ చేస్తే ఇవి మరింత దారుణంగా ఉన్నాయి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాదు వరల్డ్ వైడ్ గా చూస్తే అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా కేవలం 2.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం ఆయన కెరీర్ కి డిజాస్టర్ గా మారింది . దీంతో తమ్ముడు ఏజెంట్ డిజాస్టర్ రికార్డును బ్రేక్ చేసి మరో దారుణమైన రికార్డు నెలకొల్పాడు అన్న నాగచైతన్య అంటూ ఆడేసుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీకి హిట్ అనేది పడట్లేదు. దీనిపై నాగార్జున సీరియస్ గా ఆలోచించకపోతే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news