MoviesOh My God : రష్మిక కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్...

Oh My God : రష్మిక కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరగడానికి కారణం అదేనా..? దిమ్మ తిరిగే నిజం బయటపడిందిగా..!!

సినిమా సెలబ్రిటీస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో వీళ్ళని ఫాలో అయ్యే సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది . కాగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎక్కువగా స్టార్ హీరోలకి ఇలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది . కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రీలో హీరోయిన్ కూడా హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోగలరు అంటూ ప్రూవ్ చేసింది రష్మిక మందన.

ఎస్ సౌత్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఫస్ట్ టైం హ్యూజ్ క్రేజ్ సంపాదించుకున్న లేడీ హీరోయిన్గా రష్మిక మందన సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . రీసెంట్ గానే ఐఎండిబి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న రష్మిక మందన .. ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో ఎక్కువమంది ఫాలోవర్లు దక్కించుకొని నెంబర్ వన్ హీరోయిన్గా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు ఇండస్ట్రీలో సమంత – పూజా హెగ్డే – తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ అందరిని వెనక్కి నెట్టి రష్మిక మందన నెంబర్ వన్ స్థానంలో నిల్చోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో రష్మిక మదనా ను ఫాలో అయ్యే సంఖ్య 38 మిలియన్లు ఉండగా.. ట్వీట్టర్ లో 4.5 ఫాలోవర్స్ గా ఉన్నారు . దీంతో మొత్తంగా సోషల్ మీడియాలో అమ్మడం ఫాలో అయ్యే సంఖ్య 42.5 మిలియన్ల ఫాలోవర్స్ గా దక్కించుకుంది. సౌత్ హీరోయిన్లలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తొలి హీరోయిన్గా రికార్డు నమోదు చేసింది రష్మిక మందన . అయితే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉండగా ఎందుకు అందరు రష్మిక నే ఇష్టపడుతున్నారు అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

అయితే రష్మిక మందన నెగిటివిటి ని పెద్దగా పట్టించుకోదని .. ఎలాంటి ట్రోలింగ్ చేసిన సరే ఆ విషయాన్ని లైట్గా తీసుకుంటుందని.. ఆమె హార్ట్ అయిన కూడా ఆ విషయాలను ఎక్కడ బయట పెట్టదని .. ఆ కారణంగానే జనాల ఆమెను ఎక్కువగా లైక్ చేస్తున్నారు అంటూ తెలుస్తుంది . త్వరలోనే పుష్ప2 సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతుంది శ్రీవల్లి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news