Moviesఅనుష్క ఆ డైరెక్ట‌ర్‌తో మొహ‌మాటానికి పోయి కెరీర్ నాశ‌నం చేసుకుందా...!

అనుష్క ఆ డైరెక్ట‌ర్‌తో మొహ‌మాటానికి పోయి కెరీర్ నాశ‌నం చేసుకుందా…!

టాలీవుడ్ లో హీరోయిన్లకు ఐదారు సంవత్సరాల లైఫ్ మాత్రమే ఉంటుంది. కెరీర్ పరంగా ఫామ్ లో ఉన్నప్పుడే చక చక సినిమాలో చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. ఒక్కసారి ఫేడ‌వుట్‌ అయితే మళ్లీ నిలదొక్కుకోవడం కష్టం. అదే హీరోలు అయితే స్టార్డమ్ మీద ఏకంగా 60, 70 ఏళ్ళు దాటిన సినిమాలు చేస్తూనే ఉంటారు. అలాంటి వాటికి భిన్నంగా 20 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. గత 20 ఏళ్లలో సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతార, స్వీటీ బ్యూటీ అనుష్క మాత్రమే లాంగ్ కెరీర్ కొనసాగిస్తూ వస్తున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది అనుష్క. ఏకచక్రాధిపత్యంగా నయనతారకు ధీటైన హీరోయిన్గా ఎదిగింది. బాహుబలి సిరీస్ సినిమాలలో అనుష్క చేసింది. బాహుబలి సినిమాల తర్వాత ఆమెకు తిరుగులేని ఇమేజ్ వ‌చ్చింది. అయితే దానిని సరిగా క్యాష్ చేసుకొని ముందుకు వెళ్ళటంలో ఆమె ఫెయిల్ అయింది. బాహుబలి తర్వాత రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వం వహించిన సైజు జీరో సినిమాలో అనుష్క నటించింది.

ఆ సినిమా కోసం.. అనుష్క ఏకంగా ఏడాదికిపైగా లాక్ అయిపోయింది. ఇందుకోసం తన ఆహార్యాన్ని లుక్‌ను చాలా మార్చుకుంది. మామూలుగా అనుష్క ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి ప్రాజెక్ట్ వెనక రాఘవేంద్రరావు ఉన్నారు. ఆయన తనయుడు డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఒప్పుకోక తప్పలేదు. చాలా రిస్క్ చేయక తప్పలేదు. అయితే ఈ సినిమా కోసం ఆమె బాగా లావెక్కి పోవడంతో ఫిజిక్ అంతా మారిపోయింది. ఆ తర్వాత తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

దీంతోపాటు వయస్సు ప్రభావం కూడా అనుష్క పై బాగా పడింది. సైజ్‌జీరో సినిమా ఏమో కానీ అనుష్క బాగా దెబ్బ కొట్టేసింది. లావెక్కిపోయిన అనుష్కకు ఛాన్సులు ఇచ్చేందుకు ఎవరు ఇష్టపడలేదు. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల పోటీ కూడా ఆమె తట్టుకోలేకపోయింది. అసలు ఇప్పుడు ఆమెకు నవీన్ పోలిశెట్టి లాంటి మరీ ఊరు పేరులేని హీరో సినిమాల్లో మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు.

ఆ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అనుష్క ఓవర్ వెయిట్ మీద ఫ్యాన్స్ కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఆమె బాడీ షేపింగ్ మీద ట్రోల్స్ అయితే మామూలుగా లేవు. కేవలం కోవెలమూడి ప్రకాష్ కోసం అనుష్క చేసిన రిస్క్‌ ఇప్పుడు ఆమె కెరీర్‌ను ఆమే నాశనం చేసుకున్నట్టు అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news